ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఓడిపోయారు.  ఆయన ఇంతటి ఓటమి సాధించడానికి ప్రధాన కారకుడు ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డే అని చెప్పవచ్చు. అలాంటి జగన్మోహన్ రెడ్డి  కేవలం 11 సీట్లకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేదు. మరి భవిష్యత్తులో జగన్ పార్టీ ఉంటుందా పోతుందా అనే పరిస్థితి కూడా ఏర్పడింది.  మరి జగన్ మోహన్ రెడ్డి ఫ్యూచర్లో మళ్లీ సీఎం కావాలి అంటే మాత్రం తప్పకుండా ఈ ఒక్క పని చేయాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎంతో కొంత కారణం షర్మిల అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కనీసం నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయిన తర్వాత చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.8% ఓట్ షేర్ తగ్గించుకుంది. 

ఇలా ఓట్లు కొన్ని కాంగ్రెస్ కు వెళ్లిపోవడం వల్లే చాలాచోట్ల వైసిపి ఓటమిపాలైంది.  రాబోవు రోజుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. అది కూడా షర్మిల ద్వారానే  రాష్ట్రంలో గట్టి శక్తిగా ఎదగాలని ట్రై చేస్తోంది. కేవలం మూడు నెలల కాలంలోనే అంత పెద్ద దెబ్బ కొట్టిన షర్మిల ఇక రాబోవు రోజుల్లో పార్టీని ఏ విధంగా విస్తరించబోతుందనేది ఆలోచిస్తే మాత్రం వైసిపికి చాలా ఇబ్బందికరమేనని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే జగన్ సైలెంట్ గా ఉంటే మాత్రం తప్పకుండా షర్మిల జనంలోకి వెళ్లి ప్రభుత్వానికి సంబంధించిన  వైఫల్యాలను బయటపెడుతూ ముందుకు వెళితే మాత్రం తప్పక వైసిపి చతికిల పడుతుంది.

ఈ విధమైన అనర్థం జరగకముందే జగన్ మోహన్ రెడ్డి పుంజుకొని తన సొంత చెల్లిని తన పంచన చేర్చుకుంటే మాత్రం రాబోవు రోజుల్లో వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇద్దరూ కలిసి జనంలోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే  2029 ఎన్నికల వరకు  వైసిపి పార్టీ జనాల్లో ఉండటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి.కాదూ కూడదని జగన్ అహంకార భావాన్ని చూపిస్తే మాత్రం  తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు రాబోవు రోజుల్లో భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. మరి చూడాలి జగన్ చెల్లెను కలుపుకొని ముందుకు వెళ్తారా లేదంటే సింహం సింగిల్ గా వస్తుందని మరోసారి చతికిల పడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: