ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ9 రజినీకాంత్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... టీవీ9 రజినీకాంత్ ను... దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు. గత ఐదు సంవత్సరాల పాలనలో... తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా.... వైసిపి కి అనుకూలంగా.. టీవీ9 వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.

 

సాక్షి కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టీవీ9 వ్యవహరించిందని... అధికారంలోకి వచ్చాక టీవీ9 పని చెప్తామని... ఇప్పటికే చాలాసార్లు తెలుగు తమ్ముళ్లు వార్నింగ్ ఇచ్చారు. నారా లోకేష్ కూడా చాలాసార్లు బ్లూ మీడియా అంటూ టీవీ9 ను దూషించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రాగానే... టీవీ9, సాక్షి అలాగే ఎన్టీవీ లాంటి ఛానల్ ను... ఏపీలో ప్రసారం కాకుండా ఆంక్షలు విధించారు.

అక్కడితో ఆగకుండా.. కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారియర్స్...  టీవీ9 రజనీకాంత్ ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. టీవీ9 రజనీకాంత్ చాలా అక్రమాలు చేశారని...  అమెరికాలో కూడా బిజినెస్ లు చేస్తున్నారని..  తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. వైసిపి పాలనలో... టిడిపిని టార్గెట్ చేసినందుకు... టీవీ9 రజినీకాంత్  కు భారీగా డబ్బులు వచ్చాయని కూడా  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

అయితే దీనిపై సీరియస్ అయిన టీవీ9 రజనీకాంత్... తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు.... టిడిపి కార్యకర్తలకు నోటీసులు కూడా ఇచ్చారు. టీవీ9 రజినీకాంత్ పై అసత్య ప్రచారం చేసినందుకుగాను.. విచారణకు రావాలని టిడిపి కార్యకర్తలకు నోటీసులు అందించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని ఆదేశిస్తూ... నోటీసులు ఇష్యూ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: