ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో  పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు. జనసేన పార్టీ ని అద్భుతమైనటు వంటి  మెజారిటీ తో గెలిపించారు. అలాంటి పవన్ కళ్యాణ్ తాను గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అలాంటి ఆయన తాజాగా వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. జూన్ 26 వ తేదీ నుంచి మొదలు వారాహి అమ్మ వారి దీక్ష ప్రారంభించి మొత్తం 11 రోజుల పాటు కొనసాగుతుందట. ఇలాంటి పవన్ కళ్యాణ్ నేడు అమ్మవారి బట్టలు వేసుకొని సోషల్ మీడియా లో దర్శనం ఇవ్వడంతో పవన్ అభిమానులంతా సంబరపడిపోతున్నారు. 

అమ్మవారి దుస్తులు వేసుకొని, నుదుట బొట్టు, పసుపు రంగు బట్టల్లో ఎంతో ఆకర్షణ గా ఉన్నారు. ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ చేయడం తో దీన్ని పట్టుకొని  శ్రీరెడ్డి నానా రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా లో షేర్ చేస్తూ "పవన్  బిజెపిని మెప్పించడానికి ఎప్పుడు వేసుకుని దీక్షలు.. వాటి ఏ హిందూ ఫాలోవర్ అంటూ  పగలబడి నవ్వే బొమ్మలను"  జోడించింది. ఈ దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు,  ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటారని తెలుస్తోంది. గత ఏడాది జూన్ లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర  విజయవంతంగా చేపట్టారు.

ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి దీక్ష పూనుకున్నారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు కాబట్టి, తాను కోరుకున్న కోరిక నెరవేరిందని ఆయన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ను ఉద్దేశిస్తూ  ఆయన బట్టలతో ఉండి చెప్పులు వేసుకోవడం తో శ్రీరెడ్డి  కామెంట్ల తో విమర్శిస్తోంది. మరి దీని పై జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: