గేమ్ ఓవర్. ప్ర‌జ‌లు తీర్పు నివ్వడం అయితే ఫైనల్ అయిపోయింది. పవర్ మార్చేశారు. కూటమికే ఆంధ్రా జనం జేజేలు పలికారు. అందుకే ఏక‌ప‌క్షంగా వేసేశారు. ఇలాంటి తరుణంలో గతసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ గ‌గ్గోళ్లు పెట్టుకుని ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి బ‌ద్ధులై ఉండ‌డం ప్ర‌జాస్వామ్యంలో సంప్రదాయం. ఈ విష‌యంలో కూట‌మి స‌ర్కారు త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం, లేఖ‌లు రాయడం అనేది సమయం వృధా చేసుకోవడమే అవుతుంది అని విషయం తెలిసిన రాజకీయ ఉద్దండుల విశ్లేషణ. అవును, ఇలాంటి పరిస్థితుల్లో 39 శాతం ఓట్లు తెచ్చుకున్న కీల‌క పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న జ‌గ‌న్ కీల‌క రోల్ పోషించేందుకు ముందుకు రావాల‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌.

అవును, నిజమే... ఎందుకంటే 100 మందిని ఏక‌ప‌క్షంగా గెలిపించుకున్న కాంగ్రెస్‌కు కూడా ఈసారి కేంద్రంలో ఆటుపోట్లు త‌ప్ప‌డం లేదు మరి. ప‌దేళ్లుగా ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న పార్టీకి.. ప్ర‌జ‌లు ఇచ్చింది కాసిన్ని సీట్లే. అయినా.. ఆ పార్టీ బెరుకు చూపడం లేదు కదా ధైర్యంగా ప్రజల ప‌క్షాన తమ గొంతుకని వినిపిస్తోంది. ఒక్కసారి వెన‌క్కి వెళ్తే.. గ‌త 2019-24 మధ్య అతి పెద్ద కాంగ్రెస్ పార్టీకి జ‌నాలు ఇచ్చిన స్థానాలు 51 మాత్రమే. వీటిలో ముగ్గురు ఎంపీల‌ను మోడీ ఏదోలా లాగేసుకున్నారు దీంతో మిగిలింది 48. అయినా.. పార్టీ కుంగిపోలేదు. త‌మ‌కు ప్ర‌తిప‌క్ష హోదాలేద‌ని, ఇవ్వ‌లేద‌ని ఎక్క‌డా ఆవేద‌న వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. త‌మ‌కు ఉన్న అనుకూల మార్గాల ద్వారానే వెసులుబాట్ల‌ను వినియోగించుకుంటూ.. ప్ర‌జాభిప్రాయానికి పెద్ద పీట వేసింది.

ఇపుడు అదే మార్గాన్ని జగన్ పార్టీ నాయకులు అవలంబిస్తేగాని వైస్సార్సీపీ ఒక గాడిన పడదు. కాబ‌ట్టి .. జ‌గ‌న్ చేయాల్సింది ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళ‌మై, బ‌ల‌మై.. స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూనే గ‌త ఐదు సంవత్సరాలు చేసిన త‌ప్పుల‌ను సరిదిద్దుకుంటే కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా.. ప్ర‌జ‌లే రేపు మంచి తీర్పు ఇవ్వొచ్చు. ఎందుకంటే తాజా ఎన్నికల్లో చూసారు కదా. గతసారి ఏకపక్షంగా వైస్సార్సీపీకి మద్దతు ప్రకటించినవారు ఈసారి టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ సూత్రాన్ని విస్మ‌రించి.. దండ‌లో దారం లేద‌న్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. జగన్ & కోకి మరిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వని విక్షేషకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో ఇక్కడ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: