ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. 175 స్థానాలకు గాను 164 స్థానాలు సంపాదించుకుంది తెలుగుదేశం కూటమి పార్టీలు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో... ఈ కూటమి పొత్తుకు బీజం వేశారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటినుంచి... బిజెపి టిడిపి అలాగే జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

అయితే...  ఈ పొత్తులో భాగంగా వైసీపీకి వ్యతిరేకంగా... ఆ పార్టీని ఓడించడంలో  కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. దాని ఫలితంగానే వైసిపికి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇటు తెలుగుదేశం కూటమికి ఏకంగా 164 స్థానాలు దక్కాయి. అటు వైసిపి పార్లమెంట్ ఎన్నికల్లో...  నాలుగు సీట్లు తప్ప మిగతా అన్ని ఓడిపోయాయి. మిగతా అన్ని సీట్లు... కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. ఇక.. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది.

అదే సమయంలో మిత్రపక్షులు అయిన జనసేన కు... ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే డిప్యూటీ సీఎం పదవి పేరుకు మాత్రమేనని.. దానికి పెద్ద వ్యాల్యూ ఉండదని జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అటు కీలక శాఖలు.  జనసేనకు ఇవ్వకుండా.... పౌర సరఫరాల శాఖ, పర్యావరణం అలాగే సినిమాటోగ్రఫీ పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మూడు మంత్రి పదవులు మాత్రమే జనసేనకు ఇచ్చారు.

 ఇక ఈ మంత్రి పదవుల విషయం చల్లారకముందే... నామినేటెడ్ పదవుల వివాదం ఇప్పుడు రాజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రమే  నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు  నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అదే విషయం జనసేనకు  అసలు నచ్చడం లేదని వార్తలు వస్తున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ నేతలకే నామినేటెడ్ పదవులు ఇస్తే ఎలాగా ? ఈసారి ఎక్కువ శాతం జనసేనకు పదవులు రావాలని.. చర్చించుకుంటున్నారట. లేకపోతే.. ఊరుకునెది లేదని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: