టీడీపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంది. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చాలా మంది నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్క‌లేదు. ఇత‌ర పార్టీల నుంచి తీసుకున్న‌వారు.. గెలుపుగుర్రాల‌కు మాత్ర‌మే ఆచితూచి టికెట్లు ఇచ్చారు. ఈ క్ర‌మం లో పాత‌కాపులు.. చాలా మంది త‌ప్పుకొన్నారు. అదేస‌మ‌యంలో కీల‌క నేత‌ల‌కు పొత్తుల వ్య‌వ‌హారం కూడా సెగ పెట్టింది. దీంతో అనేక మంది నాయ‌కులు ప్ర‌చారానికి , పార్టీని గెలిపించేందుకు మాత్ర‌మే ప‌రిమిత మ‌య్యారు.


మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్కు తాయా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే.. ఉదాహ‌ర‌ణ‌కు పిఠాపురం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్న వ‌ర్మ‌.. జ‌న‌సేన పొత్తు కార‌ణంగా ఈ సీటును ప‌వ‌న్‌కు ఇచ్చేశారు. ఇక్కడ ప‌వ‌న్ స్థిర‌ప‌డిపోవ‌డం ఖాయం. మ‌రి వ‌ర్మ ప‌రిస్థితి ఏంటి? అదేవిధంగా మైల‌వ‌రం టికెట్‌ను త్యాగం చేసిన‌.. దేవినేని ఉమా.. ప్ర‌చారం మాత్ర‌మే చేశారు.


ఈ సీటు నుంచి పోటీ చేసిన వైసీపీ నాయ‌కుడు వ‌సంత కృష్ణ‌ప్రసాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ న కూడా ఇక్క‌డే స్థిర‌ప‌డిపోతారు. అలాగే.. పెద‌కూర‌పాడు (గుంటూరు) నుంచి బ‌రిలో నిలిచిన‌.. భాష్యం ప్ర‌వీణ్ స్థిర‌ప‌డ‌తారు. ఇక్క‌డ సీటు త్యాగం చేసిన కొమ్మాల‌పాటి ప‌రిస్థితి ఏంటి?  అంటే.. ఇప్ప‌టికి వారి పరిస్థితి ఇబ్బందే అయినా.. వ‌చ్చేఎన్నిక‌ల నాటికి బాగానే ఉంటుంద‌ని పార్టీ సంకేతాలుపంపించింది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం.. 2026 నాటికి రాష్ట్రంలో సీట్లు పెరుగుతున్నాయి.


ప్ర‌స్తుతం 175గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 225కు చేరుతున్నాయి. అలాగే పార్ల‌మెంటు స్థానాలు ప్ర‌స్తుతం 25 ఉండ‌గా.. 34కు చేరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పెరిగే సీట్ల‌ను పాత వారికి ఇచ్చే అవ‌కాశం లేదా.. కొంత మేర‌కు అడ్జ‌స్ట్ చేసే అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్ర‌స్తుతం సీట్లు కోల్పోయినా.. వ‌చ్చే ఎన్నిక ల‌నాటికి.. వారికి ఎకామ‌డేష‌న్ ఉంటుంద‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ తేడా గా ఉంది. ఇప్ప‌టికే తాజా ఎన్నికల్లో వ్య‌తిరేక‌త ఉన్న‌వారిని ప‌క్క‌న పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నాయ‌కుల‌ను వెతుక్కునే ప‌రిస్థితి ఉంటుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: