వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఓట‌మి బాధ‌లో త‌న అక్క‌సు అంతా చూపిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌ల్నాడు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ మంత్రి.. సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేతిలో ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నను మంత్రి హోదాలో ఓడించిన స‌త్తెన‌ప‌ల్లి ఓట‌రుపై అక్క‌సు వెళ్ల గ‌క్క‌డంతో పాటు తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఓట‌ర్లు ఆయ‌న‌పై సెటైర్లు వేస్తున్నారు.


 `సత్తెనపల్లి ఓటర్లు కంటే సుకన్య నే బెటర్` అంటూ వ్యాఖ్యానించ‌గా.. కొంద‌రు మాత్రం ఇచ్చిన డబ్బులకు సంజన న్యాయం చేసిందని.. డబ్బులు తీసుకుని సత్తెనపల్లి ఓటర్లు ఓటేయలేదని సెటైర్లు పేలుస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోతే ఎలాంటి నేత అయినా ప్ర‌జా తీర్పును గౌర‌వించాలి . . అప్పుడు వారి హుందాత‌నం తేట తెల్ల‌మ‌వుతుంది. కానీ రాంబాబు మాత్రం ఓటిపోవ‌డంతో హ‌ద్దులు దాటేసి మ‌రీ రెచ్చి పోతున్నారు .


ఇక రాంబాబుకు ఇంటి అల్లుడే సెగ పెట్టేశారు. ఎన్నిక‌ల‌కు ముందే రాంబాబు సొంత అల్లుడు త‌న మామ రాంబాబు దుర్మార్గుడ‌ని.. ఆయ‌న‌ను ఓడించాల‌ని స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌ల‌కు పిలుపునివ్వ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత స‌త్తెన‌ప‌ల్లి ఓట‌ర్లు త‌న‌ను మోసం చేశార‌ని డ‌బ్బులు తీసుకుని కూడా ఓట్లేయ‌లేద‌ని మండిప‌డ్డారు .. పైగా దీనిక‌న్నా సుక‌న్యే న‌యం అని ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య కూడా చేశారు.

ఇక అంబ‌టి వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చి వేత‌పై కూడా మాట్లాడారు. గ‌తంలో తాము అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ కార్యాల‌యాలు కూడా.. తాము కూల్చే సి ఉంటే బాగుండే దేమో.. కానీ, మా ముఖ్య‌మంత్రి అలాంటి ప‌నులు చేయొద్ద‌ని త‌మ‌ను ఆపి మంచి మ‌న‌సు చాటుకున్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో క‌క్ష‌పూరిత కాలం న‌డుస్తోంద‌ని అంబ‌టి వాపోవ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: