తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక కాంగ్రెస్ సీనియర్ నేతలు... అలకబూనుతున్నారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను... సీనియర్లకు చెప్పకుండా చేర్చుకుంటునన్నారని రేవంత్ రెడ్డి పై.. ఆగ్రహిస్తున్నారు సీనియర్లు. ఇటీవల జగిత్యాలకు చెందిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

 ఇప్పుడు ఇదే అంశం తీవ్ర  వివాదంగా మారిపోయింది. జగిత్యాల నియోజకవర్గం లో... డాక్టర్ సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డి బద్ధ శత్రువులుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో.. చివరి రౌండ్ వరకు వీరి మధ్య పోట పోటీ నెలకొంది. కానీ చివరికి జీవన్ రెడ్డి పై డాక్టర్ సంజయ్ కుమార్ గులాబీ పార్టీ తరఫున విజయం సాధించారు. అయితే అలాంటి ఎమ్మెల్యేను.. జీవన్ రెడ్డికి చెప్పకుండానే రేవంత్ రెడ్డి చేర్చుకున్నారు.

 ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొనడం వివాదంగా మారింది. అయితే దీనిపై వెంటనే అలిగిన... జీవన్ రెడ్డి... పార్టీకి రాజీనామా చేస్తానని కూడా బెదిరించారు. గత రెండు రోజులుగా... జగిత్యాల చుట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయనకు బిజెపి అలాగే గులాబీ పార్టీ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయట. దీంతో వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ... మంత్రి శ్రీధర్ బాబుతో  రాయబారం పంపింది.

 జీవన్ రెడ్డి ని బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయన వినలేదు. ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా రంగంలోకి దిగి.. ఈ సమస్యపై మాట్లాడారు. అయినా కూడా జీవన్ రెడ్డి ఎక్కడ తగ్గలేదు. దీంతో సోనియా గాంధీ నేరుగా జీవన్ రెడ్డికి ఫోన్ చేశారట. ఇక ఇవాళ ఢిల్లీకి జీవన్ రెడ్డి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి... జీవన్ రెడ్డికి ఇస్తామని కాంగ్రెస్  అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇచ్చారట. దీంతో చల్లబడ్డ జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: