పవన్ కళ్యాణ్ ఏది చేసిన  దాని వెనుక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది. ఆయన పట్టుబట్టి ఏదైనా సాధించాలి అనుకున్నాడు అంటే తప్పకుండా దాని కోసం ఎంతవరకైనా వెళ్తాడు.  వెళ్లే దారిలో కష్టాలు రాని, ప్రాణం పోనీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటాడు. ఈ విధంగా  కష్టపడే తత్వం పేదలకు సాయం చేసే గుణం ఉంది కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా తనకి ఎవరూ సాటి లేరు అనిపించుకున్నాడు.  ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో సంచలనం సృష్టించి, అసాధ్యం అనేదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. 

ఈయన లేకుంటే ఈరోజు చంద్రబాబు కూడా ఉండేవారు కాదు. ఈ విధంగా టిడిపి కూటమిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించి తాను కూడా మంచి మెజారిటీతో గెలిచి రాష్ట్రంలో మరియు దేశంలో కీలక లీడర్గా ఎదిగారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన వాహనం ద్వారా వారాహి యాత్రను కూడా చేపట్టారు. ఈ సమయంలోనే పవన్ ఎంతో కష్టపడి, ప్రజల్లోకి వచ్చి నిర్విరామ కృషి చేసి  తన జనసేన పార్టీని కేంద్రస్థాయిలో గుర్తించే స్థాయికి తీసుకువచ్చారని చెప్పవచ్చు.  అలాంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత తన కోరిక తీర్చినటువంటి వారాహి అమ్మవారిని దర్శించుకుని 11 రోజుల దీక్ష చేపట్టారు.

దీక్ష సమయంలో ఆయన 11 రోజులపాటు ఆహారం ముట్టకుండా కేవలం పండ్లు, పాలు  వంటివి తీసుకుంటూ కఠినంగా ఉంటారట.  ఇదే తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ జగన్ కు 11 సీట్లు ఇవ్వాలని  వారాహి అమ్మవారిని కోరుకున్నారా. ఆమె కరుణించి జగన్ కు 11 సీట్లు మాత్రమే ఇచ్చిందని,  అందుకే ఆయన 11 రోజుల దీక్ష చేపట్టారని అంటున్నారు. అంతేకాకుండా మొత్తం కూటమికి 164 సీట్లు ఇచ్చారు. 164 మొత్తం కలిపితే 11 సీట్లకి సమానంగా అవుతుంది.  ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలను దేవుళ్ళు కూడా క్షమించలేదని అందుకే 11 సీట్ల పరిమితం చేశారని దానివల్లే పవన్ కళ్యాణ్ కూడా 11 రోజుల దీక్ష చేపట్టారని పలువురు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: