మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే గతంతో పోల్చి చూస్తే మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనే లేదని కూటమి నేతలు తేల్చి చెప్పేశారు. జగన్ సైతం వైసీపీ ప్రతిపక్ష పార్టీ అని కాకుండా ప్రజల పక్షాన నిలిచే పార్టీ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాల్సి ఉంది. పార్టీ కోసం నిజంగా కష్టపడిన వాళ్లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే మంచిది.
 
రాష్ట్రంలో వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. కూటమి పొత్తు లేకపోతే వైసీపీ కచ్చితంగా 60 నుంచి 70 స్థానాల్లో విజయం సాధించేదని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ కు ప్రతిపక్షం కొత్త కాదు. అయితే సీట్ల సంఖ్య మాత్రం భారీగా తగ్గింది. కానీ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. కూటమి హామీలను నిలబెట్టుకోకపోయినా, అభివృద్ధి చేయకపోయినా ప్రజలు వైసీపీ వైపు చూస్తారు.
 
2029 ఎన్నికల నాటికి వైసీపీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అయితే బలమైన నేతలు పార్టీలో ఉన్నారని మరోసారి జగన్ కు సీఎంగా ఛాన్స్ ఇస్తే ఆ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకుంటాడని అభిప్రాయం ప్రజల్లో కలిగితే చాలని చెప్పవచ్చు. ప్రజలకు, కార్యకర్తలకు జగన్ వీలైనంత దగ్గరగా ఉంటే మంచిది. అదే సమయంలో రుణమాఫీ లాంటి రిస్కీ హామీల అమలును భవిష్యత్తులో అయినా జగన్ ప్రకటించాల్సి ఉంది.
 
ప్రజలు కోరుకునే విధంగా పాలన అందిస్తాననే నమ్మకాన్ని జగన్ కలిగిస్తే మరో ఐదేళ్ల తర్వాత వైసీపీకి అధికారం దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగన్ తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుంటూ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పార్టీని పుంజుకునేలా చేస్తూ జగన్ తెలివిగా అడుగులు వేయాల్సి ఉంది. కూటమి చేస్తున్న తప్పులను వెలుగులోకి తెస్తూ వైసీపీ నేతలు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి పూర్వ వైభవం రావడం పక్కా అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: