ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక వైసిపి అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ పార్టీ 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పార్టీ పోటీలోకి దిగింది. ఈ ఎన్నికలలో ఈ పార్టీకి పెద్ద మొత్తంలో స్థానాలు రాలేదు. కాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే స్థాయిలో స్థానాలు వచ్చాయి. 2014 వ సంవత్సరం పోటీలో ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం అయ్యారు.

ఈ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజల్లో మంచి క్రేజ్ లభించింది. ఇక 2019వ సంవత్సరం వైసీపీ పార్టీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఇలా ఈ పార్టీ అధినేత అయినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో ఈ పార్టీకి అసెంబ్లీ స్థానాలు వచ్చాయి అని కూడా కొంత మంది భావించారు. ఇక 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీకి గోరమైన ఎదురు దెబ్బ తగిలింది. పోయినసారి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని అద్భుతమైన పార్టీగా నిలిచిన వైసిపి ఈ సారి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకొని ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల నుండి మళ్ళీ వచ్చే ఎన్నికలలో వైసిపి పుంజుకోవాలి అంటే జగన్ మళ్ళీ జనాలతో మమేకం కావాలి అని అనేక మంది అంటున్నారు. మళ్ళీ 2014 నుండి 2019 వరకు జగన్ ఎలాంటి వ్యూహాలను రచించి జనాలకు దగ్గర అయ్యాడో అలాంటి వ్యూహాలను మళ్లీ రచించి జనాలకు దగ్గర కావాలి అని అనేక మంది సూచిస్తున్నారు. అలా కానట్లయితే జగన్ 2029 లో వచ్చే ఎన్నికలలో కూడా గెలవడం కష్టమే అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. మరి జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలను రచిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: