సినీ హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు అవుతున్న గెలవడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఈసారి కూటమిలో భాగంగా పోటీ చేయడంతో 21 స్థానాలకు 21 సీట్లను సంపాదించి మంచి విజయాన్ని అందుకున్నారు. గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు దీంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కెరియర్ ని పిఠాపురం ప్రజలు మార్చేశారని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


మరి అలాంటి ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. ఎన్నికల ముందు తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని పిఠాపురం చేస్తారంటూ ఆమె కూడా ఇవ్వడం జరిగింది.. కొద్దిరోజులుగా పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నారనే విషయం ఇంకా తెలియాలి. అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటనే నెరవేర్చుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. జనవాని కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకొని డిప్యూటీ సీఎం గా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.



తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఎన్నికల సమయంలోనే కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కూడా పవన్ కళ్యాణ్ సంప్రదించారట. పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించేందుకు వైసిపి చాలానే ప్రయత్నాలు చేసింది పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ కు తిరుగులేని మెజారిటీ అందించారు మొదటిసారి శాసనసభలో కూడా అడుగుపెట్టేలా చేశారు ఈ విజయాన్ని పిఠాపురం వాసులకు రుణం తీర్చుకోవాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ కుప్పం మంగళగిరి వంటి ప్రాంతాలకు దీటుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే కుప్పానికి చాలానే తీసుకోవచ్చారు.  మంగళగిరి కి లోకేష్ కూడా ఐటీ హబ్ గా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నారు. కనుక వరి పంటలు పండిస్తూ ఉంటారు కనుక అక్కడ విశిష్టమైన ఒక దేవత ఆలయం చరిత్ర ఉన్నది. ఈ టెంపుల్ ని టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికలలో తెలిపారు. అలాగే వరి పత్తి పండిస్తున్న రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే సాగునీటికి కూడా పరిష్కరించాలని హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఇవే కాకుండా ఈ ఐదేళ్లలో మరిన్ని చేస్తానని కూడా తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: