పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులను  మంత్రి నారా లోకేష్ నిన్నటి రోజున సచివాలయంలో సాయంత్రం మూడు గంటల పాటు సుదీర్ఘ సమీక్షంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ పలు కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగానే జరగాలని విద్య ,ఐటి, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు  రాకూడదని తెలిపారు.


ఉపాధ్యాయులకు బోధనయతర పనులు అవసరమైన యాప్స్ భారాన్ని కూడా తగ్గించాలంటూ చర్యలు తీసుకున్నారు లారా లోకేష్.. పాఠశాలలో సదుపాయాల కల్పనకు సైతం పలు రకాల కమిటీల ద్వారా పరిశీలించాలని కూడా తెలియజేశారు. రాబోయే సమీక్షలు మూసివేసిన పాఠశాలలను కూడా అందుకు సంబంధించిన వివరాలను కూడా అందించాలంటూ లోకేష్ ఆదేశాలను జారీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశారు. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమాతాయో అనే అంశం పైన అధికారులు లెక్కలు చెప్పాలంటే లోకేష్ తెలిపారు.



అయితే గత ఐదేళ్ల ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్లారని లోకేష్ తెలియజేశారు దీంతో చిల్డ్రన్స్ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది అంటూ తెలిపారు. ఈ సందర్భంగా జర్మనీ ఆస్ట్రియా తో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాలు విద్యావ్యవస్థలను కూడా ప్రోత్సహిస్తామంటూ తెలియజేశారు లోకేష్. రాయలసీమ ప్రాంతాలలో ఎక్కడ పాఠశాలలో కొరకు ఉన్నది ఎక్కడ నూతన పాఠశాల ప్రారంభించాలనే విషయం పైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటామంటూ తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కల్పన కూడా చేపడతామంటూ లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: