* సంక్షేమ పథకాల ట్రాన్స్ లో ఉన్న జగన్  

* వాటి ఊసు ఎత్తకపోతేనే గెలిచే అవకాశం  

* జగన్ చాలా మారాలి  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

వ్యాపారి అయినా, క్రీడాకారుడైనా, సినిమా నటుడైనా సరే తాను చేస్తున్న పనుల వల్ల కలిగే కాన్సిక్వెన్సెస్ ఏంటో ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయ నాయకుడి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు మాట్లాడే మాట, చేసే ప్రతి పని ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించుకోవాలి. కానీ ఏపీ మాజీ సీఎం జగన్ అవి ఏమీ ఆలోచించలేదు. సంక్షేమ పథకాలు అందజేయడానికి బటన్ నొక్కితే చాలు ఓటు పడిపోయిద్ది అనుకున్నారు.

తాను ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్చానని కాబట్టి గంపగుత్తగా ఓట్లు అన్నీ తమ పార్టీకే పడిపోతాయని జగన్ ప్రచారంలో కూడా మాట్లాడారు. దీన్ని ఆయన ఒక్కడే నమ్మకుండా పార్టీ వారినందరినీ నమ్మించారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ అతిపెద్ద మెజారిటీతో గెలుస్తుందని అనుకున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని పార్టీ కేడర్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటే తనికెళ్లి చేస్తానని జగన్ అందరినీ నిర్లక్ష్యం చేశారు దీంతో బలమైన వారందరూ వేరే పార్టీలోకి వెళ్లిపోయారు.

 కానీ జగన్ అనుకున్నట్లు జరగలేదు. పెన్షనర్లు తప్ప మిగతా వారెవరు జగన్ కు ఓటు వేయలేదు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల లబ్ధిదారులు కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. వైయస్సార్ నేస్తం పేరిట లక్షల మందికి డబ్బులను అందజేశారు కానీ వారు కూడా జగన్ కి ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. అంతేకాకుండా, టీడీపీ ఓటు బ్యాంకు పథకాలు తీసుకొని జగన్ కి కాకుండా తమ పార్టీ వారికి ఓటు వేసుకున్నారు. ఇంత జరిగాక కూడా సంక్షేమ పథకాలను అందిస్తాను, అవే తమను గెలిపిస్తాయి, ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే తాను ఓడిపోయాను అనుకుంటే జగన్ కంటే అవివేకి ఎవరూ ఉండరు.

 సంక్షేమ పథకాల ఊసు ఎత్తకుండా ఉంటేనే జగన్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అక్క చెల్లెలు అవ్వ తాతలు ఓట్లు ఏమయ్యాయో అవన్నీ మాకే పడాలి కదా అంటూ ఫలితాల రోజు కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలకు ఓట్లు నాలుగు అని ఆయన అప్పటికే అర్థం చేసుకోలేదు. ఇప్పటికీ కూడా మంచే చేశాను అయినా గెలవలేదు ఎందుకో అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జగన్ ప్రసంగాలను అనవసరమైన పదాలను వాడటం కూడా మానేయాలి. జీవీడి కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి పంటే అపరి మేధావులు ఇంతకుముందు జర్నలిస్టులుగా పని చేశారు వారిని అడిగితే మంచి ప్రసంగాలు రాసిచ్చే అవకాశం ఉంది. జనాలకు విసుగు తెప్పించకుండా మాట్లాడాలి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓడిపోయిన సరే చాలా ఠీవీగా నిలబడేవారు. అసెంబ్లీలో అందరికీ వణుకు పుట్టించే వారు కానీ జగన్ మాత్రం చాలా భయపడిపోతున్నారు. ఒక నేత అలా ఉండకూడదు. జగన్ తన తండ్రిని గుర్తు తెచ్చుకోవాలి ఆయన ఉంటే ఎలా ప్రవర్తించేవారో ఈయన కూడా అలాగే ప్రవర్తించాలి. యాత్ర యాత్ర 2 సినిమాలు చూడటం ద్వారా ఆయన తన ద్వారా స్ఫూర్తిగా ఉంది మళ్ళీ నిప్పు కనికలాగా ఎగిసిపడచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: