•వ్యక్తిగత విమర్శలు ఆపకుంటే జగన్ గెలవడం కష్టమే!
•మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చెయ్యాల్సిందే!
•సోషల్ మీడియాలో పాజిటివిటి వస్తేనే గెలుపు లేదంటే పతనమే!

( అమరావతి - ఇండియా హెరాల్డ్) : జగన్‌ ఈ ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఇంత ఘోరంగా ఏపీ చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోలేదు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో స్థానాలు దక్కించుకుని గెలిచి.. ఆ తరువాత ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయిన మరో నేత చరిత్రలో ఇంకొకడు లేడనే చెప్పాలి. దీంతో జగన్ రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్టేనని స్పష్టం అవుతుంది. అయితే.. మళ్లీ జగన్‌ గెలుస్తాడా? మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా అంటే.. జగన్ కొన్ని తెలుసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది. లేదంటే ఖచ్చితంగా పతనం అవ్వడం పక్కా అని తెలుస్తుంది.జగన్ మళ్లీ గెలవాలంటే ముందుగా చేయాల్సిన ప్రత్యర్థులని పర్సనల్ అటాక్ చెయ్యకుండా ఉండాలి. ఇదే జగన్ ఫెయిల్యూర్ కి బిగ్గెస్ట్ రీజన్. దీనివల్ల జనం ఘోరంగా వైసీపీని ఓడించారన్నది పచ్చినిజం. దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే.. పార్టీ అంత త్వరగా కోలుకుంటుంది.

పర్సనల్ అటాక్ చెయ్యడం వల్ల అవతలి వాళ్లకి సింపతీ వర్క్ ఔట్ అవుతుంది. వాళ్లపై జనాల్లో సానుభూతి కులుగుతుంది. అలాగే పర్సనల్ అటాక్ చేసే వాళ్లపై జనాలకు కోపం వస్తుంది.కాబట్టి ఇలా చెయ్యకుండా జగన్ జాగ్రత్త పడాలి.అలాగే తన నోటిని, తన నాయకుల నోటిని అదుపులో పెట్టుకోవాలి. ప్రత్యర్థిని రాజకీయంగా కొట్టాలే తప్ప వ్యక్తిగతంగా కొట్టకూడదు అనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. అలాగే సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలి. అసలు ఈ కాలంలో సోషల్ మీడియా అనేది వరం లా మారింది. మనం పబ్లిక్ లో చేసే మంచి పనులు జనాల్లోకి వెళ్ళేది ఈ సోషల్ మీడియా ద్వారానే. అలాగే చేసే విమర్శలు, బూతులు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి వెళతాయి. కాబట్టి ఈ విషయాన్నీ జగన్ తెలుసుకొని సోషల్ మీడియాలో నెగటివ్ కాకుండా జాగ్రత్త పడాలి. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో జగన్ సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ అయితే అంత త్వరగా గెలిచే ఛాన్స్ ఉంది. మరి ఇవి తెలుసుకొని జగన్ ముందుకు వెళతాడో.. లేక తెలుసుకోకుండా పూర్తిగా పతనం అవుతాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: