జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. అలాంటి జీవన్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి  బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు.  అలాంటి ఆయనకి ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఉంది. ఇదే తరుణంలో జగిత్యాల నియోజకవర్గంలో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తన నియోజకవర్గానికి చెందిన ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం జీవన్ రెడ్డికి తెలియకపోవడంతో  ఆయన విపరీతంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీ వీడతానని, ఇంత సీనియారిటీ ఉన్న నన్ను ఎవరు పట్టించుకోవడంలేదని,  నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే చేరితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అంటూ తన బాధలు వెలిబుచ్చారు. 

 నా ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసి ఇంటివద్ద వ్యవసాయం చేసుకుంటానని తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త విపరీతంగా రచ్చ అవ్వడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రి శ్రీధర్ బాబు కలిసి బుజ్జగించారు. ఢిల్లీ పెద్దల దగ్గరికి పంపించారు. అయితే ఇదే విషయమై  రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో,  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల దీప దాస్ మున్షి మరియు కేసి వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఇదే తరుణంలో ఢిల్లీ పెద్దలు కూడా  జీవన్ రెడ్డికి స్టేట్ ఫార్వార్డ్ గా ఒక విషయాన్ని చెప్పారట. కాంగ్రెస్ లోకి చేరికలు అనేవి కొనసాగుతాయి. చేరికలు అనేవి ఆగవు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ ఆయనకు ఒక విషయాన్ని చెప్పారట. పార్టీలో మీకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారట.

అయినా మీరు వినకుంటే మాత్రం మీ ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే లేదు అన్నట్టుగా మెసేజ్ ఇచ్చారట. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ముందుగా చర్చించండి అంటూ  కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారట.  దీంతో చల్లబడిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బట్టి చూస్తే మాత్రం  నీ ఇష్టం ఉంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అనే మెసేజ్ ని జీవన్ రెడ్డి కి ఇవ్వకనే ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ అసలు జీవన్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. చివరికి జీవన్ రెడ్డి చేసేదేమి లేక చల్లబడినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: