జగన్ గెలవాలంటే కష్టపడాల్సిందే!

• గెలుపు కోసం నడ్డి వంచి పోరాటం చెయ్యాల్సిందే!

• జనాల్లోకి వస్తేనే గెలుపు.. లేదంటే ఓటమే దిక్కు!  


అమరావతి - ఇండియా హెరాల్డ్: ఒక యుద్ధంలో గెలవాలంటే కష్టపడాలి. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. బాగా శిక్షణ పొందాలి. యుద్ధ విద్యల్లో ఆరితేరి పోవాలి. ఎంత పెద్ద యుద్ధం మన ముందుకు వచ్చినా ఖచ్చితంగా రెడీగా ఉండాలి. గెలవాలి. ఒకవేళ ఓడినా మళ్ళీ ఓ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ యుద్ధం చేసి గెలవాలి. అయితే యుద్ధం గెలిచాక.. ఆహా మనం గెలిచాం.. రాజ్యం మనదే.. ఇక నడ్డి వంచకుండా విశ్రాంతి తీసుకుందాం.. సుఖం మరుగుదాం అంటే కుదురుతుందా? యుద్ధం ఎప్పుడైనా రావొచ్చు.. కాబట్టి అను నిత్యం జాగ్రత్త పడాలి.. జగన్ మోహన్ రెడ్డి కూడా అంతే.. ఎంతో కష్టపడి పాద యాత్ర చేసి జనాల్లోకి వెళ్లి 2019 లో గెలిచాడు.. కానీ గెలవకముందు పడ్డ కష్టం గెలిచాక మాత్రం కనబడలేదు. సాఫీగా రిలాక్స్ అయ్యాడు. 


ఇక గెలిచాలే ఆంధ్ర రాజ్యం అంతా నాదేలా.. నా రాజకీయం.. నా ఇష్టం అన్నట్టు జగన్ తీరు ఉండేది.. ఆ తీరే జగన్ కొంపముంచింది. 11 సీట్లకే జగన్ ని పరిమితం చేసింది. తన గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాజకీయంగా రాడ్డు తేలకుండా రాజకీయంగా బాగా సుఖం మరిగాడు. సుఖానికి అలవాటు పడ్డాడు. ఆ తీరునే ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.. ఓడిపోయాడు.. కాబట్టి ఖచ్చితంగా జగన్ నడ్డి వంచి జనాల్లోకి వచ్చి కష్టపడాలి. పోరాటం చెయ్యాలి. జానాలని గెలుచుకోవాలి. మళ్ళీ గెలవాలి. ఇవేమి చెయ్యకుండా అసెంబ్లీకి హాజరు కాకుండా టూర్లు, షికార్లు చేస్తూ రిలాక్స్ అవుతే.. ఇక జగన్ జనాలే కాదు ఆ దేవుడు దిగివచ్చిన గెలిపించలేడు. కాబట్టి జగన్ మళ్ళీ భారీ మెజారిటీతో గెలవాలంటే మళ్ళీ కష్టపడాలి. నడ్డి వంచాలి. జనాల కోసం పని చెయ్యాలి. అప్పుడే జగన్ గెలుస్తారు.. లేదంటే మళ్ళీ ఘోరంగా ఓటమి పాలవుతాడు. మరి చూడాలి రాబోయే 5 ఏళ్లలో జగన్ అన్న ఎలా కష్టపడతారో...

మరింత సమాచారం తెలుసుకోండి: