మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాల్లో ఎంత అనూహ్యమైన  ఫలితాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండమైన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఓటమిని చదివి చూసింది. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.


 జగన్ ఇంతటి పరాజయాన్ని చూసిన తర్వాత అతని రాజకీయ భవితవ్యం ఏంటి? మళ్లీ అధికారంలోకి రాగలరా? అనే విషయంపై అంతటా చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఫాలో అవ్వాల్సిందే అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కనీసం ఒక పదవిలేని స్థాయి నుంచి ఇప్పుడు ఏపీ రాజకీయాలు కింగ్ మేకర్ స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్.


 ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో  2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు. అయినా పవన్ వెనక్కి తగ్గలేదు. తాను ప్రజా నాయకుడిని అని నిరూపించుకున్నారు. పదవి ఉన్నవాళ్లే ప్రజలను దూరం పెడుతుంటే.. పదవిలేని పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు. ఎక్కడ సమస్య ఉన్న నేను ఉన్నాను అనే భరోసా కల్పించారు. ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. అప్పటి జగన్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసిన ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గలేదు.


తాను అందరిలాంటి నాయకుడిని కాదు ఒక పోరాట యోధుడిని అన్న విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు జగన్ ఘోర పరాజయం తరవాత  అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడం ఇక ప్రజా సమస్యలను పట్టించుకోవడం చేయకుండా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ.. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలని అలాంటప్పుడే ప్రజల్లో జగన్ పై పోయిన నమ్మకం మళ్ళీ పెరుగుతుందని.. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా ఇబ్బందులకు గురి చేసిన తట్టుకుని నిలబడాలని.. అప్పుడే జగన్ వెంట జనం వస్తారని.. ఇలా పవన్ చేసింది జగన్ ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తే 2029 ఎన్నికల్లో విజయం ఖాయం అయ్యే ఛాన్స్ ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: