•మళ్లీ అధికారం రావాలంటే రైతులే ప్రధాన అస్త్రం

•అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం

•ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

2019 ఎన్నికలలో ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో పొందిన వైసిపి ప్రభుత్వం ఊహించని విధంగా 151 స్థానాలలో విజయం సాధించి ఒక రికార్డు సృష్టించారు.. యువ నాయకుడిగా రాజకీయాలలోకి అడుగబెట్టిన జగన్మోహన్ రెడ్డి.. ఈ రేంజ్ లో సీట్లను కైవసం చేసుకోవడం నిజంగా ఒక రికార్డు అని చెప్పవచ్చు.. అయితే గతంలో అన్ని సీట్లను కైవసం చేసుకున్న వైసిపి ప్రభుత్వం 2024 ఎన్నికలలో ఊహించని విధంగా కేవలం 11 సీట్లకే పరిమితం అవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. ఓటు బ్యాంకు 45% ఉన్నప్పటికీ కేవలం 11 సీట్లకే పరిమితం అవడం పలు అనుమానాలకు కూడా దారితీస్తోంది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలు హ్యాక్ చేశారని,  కొన్నిచోట్ల దారుణాలు చేశారని ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రజల తీర్పు ఒకటే.. ఈసారి కూటమికి అధికారం కట్టబెట్టారు.

దీంతో ఎలాగైనా సరే 2029 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడానికి... ప్రజల్లో విశ్వాసం పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.. అందులో భాగంగానే ప్రజలను కలుస్తూ.. వారిలో నమ్మకాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.. అయితే 2029 ఎన్నికలలో వైసిపి అధికారంలోకి రావాలి అంటే ఈ కొన్ని పనులు తప్పకుండా చేయాల్సిందే.. ముఖ్యంగా రైతు రుణమాఫీ.. రుణమాఫీ లో భాగంగా పంట రుణాల పైన రూ.50,000 , బంగారు రుణాల పైన 50 వేల రూపాయలను మాఫీ చేస్తామని ప్రకటిస్తే కచ్చితంగా చిన్న,  సన్నకారు రైతులకు ఊరట కలుగుతుంది ముఖ్యంగా లక్షలోపు రుణమాఫీ ప్రకటిస్తే కూడా చాలామంది రైతులు వైసీపీ ప్రభుత్వానికి మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. అలాగే పెట్టుబడి సాయం కూడా అందించడం అత్యవసరం. నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

టిడిపి ప్రభుత్వానికి.. బ్రహ్మాస్త్రంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినప్పటికీ.. జగన్ హయాంలో చేసినటువంటి సర్వేలను.. అలాగే ఉంచి.. రాజముద్రతో పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని చెప్పారు.. పాతవే ఉంటాయని చెప్పారు కానీ ఇటు ఇప్పటివరకు ఇలాంటివేవీ చేయలేదు.. దీన్ని బట్టి చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది.. కేవలం ఎన్నికల కోసం మాత్రమే వాడుకున్నారు.. పూర్తిగా రద్దు చేయలేదు.. ఇక ఎన్నికల ముందు దీనిని మళ్లీ ప్రజల ముందుకు తీసుకువస్తే మళ్ళీ ప్రజల్లో విశ్వాసం కలిగి అవకాశాలు లేకపోలేదు.

అలాగే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. ఈసారి కొన్ని సామాజిక వర్గాలనే కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం జరిగేలాగా చూడాలి. ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా పలుమార్పులు తీసుకురావాల్సి ఉంటుంది ఇలా కొన్ని విషయాలలో జగన్ ప్రభుత్వం ఆలోచించి అడుగులు వేస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికలలో గెలుపు వారిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: