- కూటమి సర్కార్ ను ప్రశ్నించాలి.
- చావైన రేవైనా ప్రజల్లోనే తేల్చుకోవాలి.
- అన్యాయం జరిగితే జగనన్న గుర్తుకు రావాలి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల్లోనే రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే నినాదానికి చరమగీతం పాడారు ప్రజలు. మొత్తం కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చేలా చేసి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు.  కేవలం 11 సీట్లకే పరిమితం చేసి అసలు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే విధానానికి తెర లేపారు. ఇదే తరుణంలో అద్భుత మెజారిటీతో టిడిపి కూటమి అధికారంలోకి చంద్రబాబు నాయుడును నాలుగోసారి సీఎం గా ఎన్నుకుంది. అంతేకాకుండా ఆయన కింద మొత్తం  23 మంది క్యాబినెట్ మంత్రులను కూడా ఎంపిక చేసింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే తరుణంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు.

దీంతో జనాల్లో చులకన భావం ఏర్పడబోతోంది. దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి టిడిపి కూటమి అసలు ఈ పార్టీని లేకుండా చేద్దామనే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ విధంగా కుట్రలు జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే మాత్రం ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు పార్టీ లో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు.  40 శాతానికి పైగా ఓట్ షేరింగ్ ఉన్నటువంటి ఈ పార్టీని మళ్లీ ప్రజల్లో నిలపాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏమాత్రం విస్మరించినా ప్రశ్నించాల్సిందే. అంతేకాకుండా ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీంటిపై ప్రశ్నిస్తూ తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తే ప్రజలకు మరింత కనెక్ట్ అవుతారు.

తాను ఒక్కడే చేయకుండా తన పార్టీ నాయకులకు భరోసా ఇస్తూ గ్రామస్థాయిలో నుంచి మొదలు రాష్ట్రస్థాయిలో ఉన్న టిడిపి నాయకులు ఎక్కడ ఏ అన్యాయం చేసిన తప్పనిసరిగా నిలదీయాలనే విషయాన్ని చెప్పాల్సిందే. అంతేకాకుండా  ఎక్కడ ఇబ్బందులు కలిగినా అక్కడికి వెళ్లి వారిని ఓదార్చి నేనున్నానని అండ కలిగించాల్సిందే. ఈ విధంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ జగన్ ఓడినా కానీ ప్రజల కోసం కొట్లాడుతున్నాడనే ఆలోచన తెప్పిస్తే మళ్లీ వచ్చే ఎన్నికల వరకు వైసిపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  మరి చూడాలి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారా లేదంటే నాకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: