- పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయాల్సిందే
- విజ‌న్ త‌ప్ప‌క ఉండాల్సిందే
- ఏపీ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు త‌ప్ప‌నిస‌రి

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అధికారం కోల్పోయిన వైసీపీ .. తిరిగి ప‌ట్టాలెక్కేందుకు.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఐదు సంవ‌త్స‌రాలు అయితే వెయిట్ చేయాలి. 2029లో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వైసీపీ అధినేత ఎదురుచూడాలి. అయితే.. అప్ప‌టికి కూడా.. పార్టీని.. ఆయ‌న‌ను వ్యూహాత్మ‌కంగా సంస్క రించుకోవాల్సి ఉంటుంది. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో ఆయ‌న తెలుసుకోవాలి. ఈ విష‌యంలో దూర దృష్టి అత్యంత కీల‌కం. మ‌రీముఖ్యంగా వ్యూహాల‌తో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా మూడు వ్యూహాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేయాల‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వీటిని పాటిస్తే.. ఆయ‌న కొంత వ‌ర‌కు పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.


1)  పార్టీని బ‌లోపేతం చేయ‌డం:  జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. పార్టీ ఇబ్బందిలో ఉంది. అధి నేత చుట్టూ తిరిగిన రాజ‌కీయాల‌ను ఇప్పుడు భూమార్గం ప‌ట్టించాలి. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను బ‌లోపేతం చేయ‌డం.. వారి నిర్ణ‌యాల‌కు వాల్యూ ఇవ్వ‌డం.. కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డం ద్వారా ముందు పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేయాలి. ఇదేస‌మ‌యంలో ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై కూట‌మి స‌ర్కారును ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాలి. ఉద్య‌మాలు నిర్మించాలి. ప్యాలెస్ దాటి.. గుడిసెల దిశ‌గా అడుగులు వేయాలి.


2)  చెడు ముద్ర‌లు తొల‌గించ‌డం:  ఇక‌, వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్ చాలా డ్యేమేజీ అయ్యార‌నేది నిర్వివాదాంశం. ప్ర‌తిప‌క్షాలు చెప్పినా.. లేక‌, త‌న‌కు త‌నే చెప్పుకొన్నా.. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాలు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చా యి. సైకో అని, బ‌ట‌న్ మ‌ఖ్య‌మంత్రి అని, నియంత అని.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లింది. అంతేకాదు.. మీడియాతోనూ ఆయ‌న క‌లివిడిగా ఉండ‌రని.. చ‌ర్చ ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా చెడుముద్ర‌ల‌ను తొలిగించి.. త‌న‌కంటూ.. ఒక విజ‌న్ ఏర్పాటు చేసుకుంటే మంచిద‌ని అంటున్నారు.


3)  రాష్ట్ర అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు వేయ‌డం:  కేవ‌లం డ‌బ్బులు ఇస్తే.. ఓట్లు వేస్తార‌నే దృష్టితో ఇంప్లిమెంటు చేసిన న‌వ‌ర‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ప్ర‌శాంత్ కిశోర్ చెప్పిన‌ట్టు డ‌బ్బులు ఇవ్వ‌డంఅనేది.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అనేదినాణేనికి ఒక వైపు మాత్ర‌మే. మ‌రో కోణం. అభివృద్ధి. ఈ విష‌యంలో చేసింది చెప్పుకోలేక పోయారో.. లేక‌.. ప్ర‌తిప‌క్షాలు చెప్పిన‌ట్టు చేయ‌లేక‌పోయారో.. ఏదేమైనా జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు ఈ ప‌రిస్థితి ని స‌రిదిద్దుకుంటే.. గ‌ద్దెనెక్కేందుకు మార్గం సుగ‌మం చేసుకున్న‌ట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: