ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. 11 స్థానాలకే వైసీపీ పడిపోవడంతో... ఈ పరిస్థితి నెలకొంది. వైసిపి పార్టీపై ఉన్న నమ్మకం... రోజురోజుకు బడా లీడర్లకు తగ్గిపోతుంది. దీంతో వైసిపి లో ఉంటే లాభం లేదని... ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.


తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలోకి కాకుండా... కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది... రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు బిజెపి కి టచ్ లోకి వెళ్లారట. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరోసారి తగిలేలా కనిపిస్తోంది. వైసీపీలో ఉన్న కీలక లీడర్... బిజెపి టచ్ లోకి వెళ్లారట.

జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన  రాజ్యసభ సభ్యులు, వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి.. అమిత్ షా తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణమైనా.. బిజెపిలో చేరేందుకు  రెడీగా ఉన్నారట విజయ సాయి రెడ్డి. మొన్న ఢిల్లీ లిక్కర్, విశాఖ భూ కుంభకోణం... లాంటి కేసులు ఉన్న నేపథ్యంలో... విజయసాయి రెడ్డి... వైసిపి ని వీడేందుకు సిద్ధమయ్యారట.


ఇందులో భాగంగానే అమిత్ షా తో పాటు కేంద్ర బీజేపీ పెద్దలతో కూడా టచ్ లోకి వెళ్లినట్లు నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి. విజయ్ సాయి రెడ్డి తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు బిజెపిలోకి చేరేందుకు కూడా సిద్ధమయ్యారట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ నేతలను బిజెపిలోకి తీసుకువెళ్లేందుకు... కేంద్ర పెద్దలు కూడా సిద్ధమవుతున్నారట. ఇక ఇప్పటికే... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి కూడా బిజెపి పార్టీలోకి వెళ్తున్నట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పెద్దిరెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండించింది. ఇక విజయసాయిరెడ్డిపై వస్తున్న వార్తలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: