ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నిరుద్యోగులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ ఫైల్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్ పై సంతకం చేసారు. ఈ పోస్టుల భర్తీని డిసెంబర్ చివరిలోపు పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్ కూడా మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసారు.ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.అయితే రెండు రకాలుగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.గత ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా ఈ సారి రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది..అయితే గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించలేదు. అందుకే టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.. 

అలాగే టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారి కోసం నేరుగా మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ను ఇవ్వనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెల 30న విడుదల కానున్నట్లు తెలుస్తుంది.. ఇక డిసెంబర్ 10 ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారికీ  అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించనున్నట్టు సమాచారం. ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16,347 పోస్టులకు గాను పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి.ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు అలాగే బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ కానున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఈ మెగా డీఎస్సీ నోటిఫికెషన్ ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: