ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి.. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లోనే చాలామంది పొలిటికల్ లీడర్స్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారే .అయితే విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీని రెడ్లు సైతం ఎక్కువగా అనుసరించారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రెడ్ల కోరికల సైతం తీరకపోవడం జరిగింది. దీంతో వైసిపి బ్యాక్ బౌన్ గా ఉండే రెడ్లు సైతం తాజా ఎన్నికలలో టిడిపి పార్టీకి జనసేన పార్టీకి సపోర్టివ్ గా నిలబడినట్లు తెలుస్తోంది.


తన కష్ట బలంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెడ్లను సైతం లైట్ తీసుకోవడం సహించలేకపోయారు. దీంతో 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ పడింది.. దీని ఫలితం కానీ 11 సీట్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలలో రెడ్ల ప్రాధాన్యత చాలా ఎక్కువగానే ఉంటుంది. 2011లో వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి వైసీపీ పార్టీలోనే ఉన్న  చాలామంది రెడ్లు 2024 వచ్చేసరికి వదిలేసినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తం నాలుగు జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి చాలా దెబ్బ పడిందని తెలుస్తోంది.


అదేవిధంగా నెల్లూరులో కూడా రెడ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నది. అలాంటి చోట కూడా 2014లో భారీ మెజార్టీ సాధించిన వైసీపీ 2019లో కూడా క్లీన్ షిప్ చేసింది.. 2024 చూస్తే మొత్తం అక్కడ టిడిపి పార్టీని క్లీన్ స్విప్ చేసుకున్నది. ప్రకాశం జిల్లాలో కూడా 12 అసెంబ్లీ సీట్లలో ఎనిమిది నియోజకవర్గాలలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలలో రెండు నియోజకవర్గాలలో రెడ్లు శాసిస్తూ ఉంటారు. మొత్తం మీద చూసుకుంటే రాయలసీమలో 52.. నెల్లూరులో పది ప్రకాశంలో 8 పల్నాడులో నాలుగు ఈస్ట్ గోదావరి లో రెండు ఇలా మొత్తం మీద ఏపీ అంతా కలుపుకుంటే 77 అసెంబ్లీ నియోజకవర్గం రెడ్లే శాసిస్తూ ఉన్నారు.. దీన్నిబట్టి చూస్తే రాజకీయాలలో కచ్చితంగా వీరి ప్రభావం ఉంటుంది అని వల్లే 2019లో చంద్రబాబు కూడా ఓడిపోయారు కానీ 2024 వచ్చేసరికి జగన్ ఓటమికి కూడా వీరే కారణమయ్యారని చాలామంది సీనియర్ నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: