ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు, నవ్యాంధ్రప్రదేశ్ కు రెండుసార్లు సీఎంగా పని చేయడం సాధారణమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు ప్రజల మెప్పు పొందడంతో పాటు విజన్ తో మెప్పించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ అని కార్యకర్తలు, అభిమానులు భావిస్తారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా చంద్రబాబుకు బాగా తెలుసని చెప్పవచ్చు.
 
చంద్రబాబు నాయుడు ఏం చేసినా మాటల్లో చేయరని చేతల్లోనే చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబు సీఎం అయ్యి నెలరోజులు కాకముందే యువతకు, పెన్షన్లు తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిదానంగా ఇతర హామీల అమలు దిశగా సైతం చంద్రబాబు అడుగులు వేయడం బాబు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
 
చంద్రబాబు నాయుడు అనుకుంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సులువుగా సాధిస్తారని అందరూ భావిస్తారు. అన్నీ తానై బాబు టీడీపీని ముందుకు నడిపిస్తూ మంత్రి పదవుల విషయంలో కూడా అనుభవం కంటే అర్హతలకే బాబు ప్రాధాన్యత ఇచ్చారు. కుప్పంలో బాబును ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికినా బాబును ఓడించడం సాధ్యం కాదని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.
 
బాబు ఎప్పుడూ పదేళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని అభివృద్ధి గురించి ఆయన ఆలోచనలు ఉంటాయని సన్నిహితులు చెబుతారు. సంక్షేమం బాబు ఫస్ట్ ప్రయారిటీ కాకపోయినా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బాబు ఎక్కువ సంఖ్యలో సంక్షేమ పథకాలను ప్రకటించడం జరిగింది. చంద్రబాబుకు ఆయనే సాటి అని బాబులాంటి నేతలు అరుదుగా ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకోవడంలో కూడా బాబు పాత్ర కచ్చితంగా ఉందని చెప్పవచ్చు. జగన్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో బాబు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: