ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలపై మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఏ క్షణమైనా... ఆ ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు.. ప్రత్యేక అధికారి రంగంలోకి దిగారు. బదిలీలో భాగంగా తాజాగా... జిహెచ్ఎంసి ఇన్ఫోర్స్మెంట్ అలాగే విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఏవి రంగనాథ్ నియామకమయ్యారు.


అయితే తన బాధ్యతలు తీసుకున్న వెంటనే... అక్రమ కట్టడాలను కురిచేందుకు ఏవి రంగనాథ్ రంగంలోకి దిగారు. తాజాగా లోటస్ పాండ్ పరిధిలో ఉన్న అన్ని ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై.. ఆయన సీరియస్ అయినట్లు ఒక సమాచారం.


ఇక జగన్ ఇంటి ముందు కూడా కొన్ని.. రోడ్డు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఉన్నాయి. ఈ తరుణంలో మళ్లీ జగన్ ఇంటి వైపు... తెలంగాణ అధికారులు వస్తారా అని అందరిలోనూ టెన్షన్ ఉంది. కాగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి... ఇంటి ముందు కొన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేశారు  జిహెచ్ఎంసి అధికారులు. తన సెక్యూరిటీ గార్ల కోసం నిర్మించుకున్న రెండు రూములను.. గత వారం రోజుల కిందట  తెలంగాణ ప్రభుత్వ అధికారులు ధ్వంసం చేశారు.


అయితే ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని... వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే అప్పటి  కమిషనర్ను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో వైసిపి పార్టీ.. కాస్త రిలాక్స్ అయింది. అయితే అప్పుడు..  దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి... ఈ తతంగమంతా నడిపించారట. చంద్రబాబు కోసం... అధికారులకు ఆదేశానికి ఇచ్చారట. అయితే వెంటనే దీనిని రేవంత్ రెడ్డి చక్క దిద్దుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: