ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూస్తోంది. మొదటగా వైసిపి కార్యాలయాలను కూల్చేందుకు నోటీసులు అంటించారు అధికారులు. తాడేపల్లి పార్టీ ఆఫీసును ఇప్పటికే ద్వంసం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోంది.


అంతేకాకుండా వైసిపిలో ఫైర్ బ్రాండెడ్ గా ఉన్న నేతలపై కేసులు పెడుతోంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది. అదే చెత్త పోసే డంపింగ్ యార్డ్. తణుకు డంపింగ్ యార్డ్  కుంభకోణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చుట్టుకుంది. తణుకులో డంపింగ్ యార్డ్ కోసం ఏకంగా 340 కోట్లు ఖర్చు చేసినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎకరానికి 42 కోట్ల చొప్పున టి డి ఆర్ బాండ్లు తణుకు మున్సిపాలిటీ చెల్లించిందని సమాచారం.


ఈ తతంగమంతా వైసిపి పాలనాలో జరిగిందట. అయితే.. వైసిపి అండ దండలతోనే ఈ.. టి డి ఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కీలక సూత్రధారి పులువు అనిల్ కుమార్ అని సమాచారం. అధికారులతో కలిసి మాండ్ కుంభకోణానికి అనిల్... తెర లేపాడట. ఈ తతంగం మొత్తం 2021 నవంబర్లో జరిగిందట. అంతేకాదు డంపింగ్ యాడ్ సేకరించే స్థలంలోనే... అనిల్ ల్యాండ్ కూడా కొనుగోలు చేశాడట.


దాంతో పాటు తన కుటుంబ సభ్యుల పేరు పైన కూడా లాండ్స్ ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే  8 ఎకరాల భూమికి 340 కోట్ల టిడిఆర్ బాండ్లు కూడా అనిల్ కుమార్ పొందినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా పక్క ప్లాన్ తో జరిగినట్లు...  ఇప్పుడు టిడిపి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది.  ఈ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై విచారణ అందం సిద్ధం చేస్తోందట. ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు చేస్తే... వైసీపీలో ఉన్న కీలక నేతలు బయటపడతారని టిడిపి అనుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: