ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పయ్యావుల కేశవ్ పేరు బాగా మారుమ్రోగుతోంది. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి అధికారం కష్టమనే సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన పయ్యావుల కేశవ్ మంత్రి పదవి దక్కడంతో తనకు దక్కిన అవకాశాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ ఏపీ ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నారు.
 
కొన్ని విషయాలకు సంబంధించి వైసీపీ నేత జగన్ కు గౌరవం ఇస్తూ వార్తల్లో నిలిచిన పయ్యావుల కేశవ్ అదే సమయంలో రూల్స్ మాట్లాడుతూ పొగ పెడుతున్నారు. ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు గతంలో చెప్పిన పయ్యావుల జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని వైసీపీ ఫ్లోర్ లీడర్ పదవి మాత్రమే వస్తుందని వెల్లడించడం జరిగింది. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలన్నా పదేళ్లు పడుతుందంటూ ఆయన వైసీపీ పరువు తీసేశారు.
 
గతంలో తెలంగాణలో కాంగ్రెస్ కు సైతం ప్రతిపక్ష హోదా దక్కలేదనే విషయాన్ని సైతం ఆయన చెబుతున్నారు. స్పీకర్ కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పడం ద్వారా పయ్యావుల వైసీపీని ఏ రేంజ్ లో టార్గెట్ చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పయ్యావుల కేశవ్ కు కౌంటర్లు ఇవ్వడం వైసీపీ నేతలకు చేత కావడం లేదు.
 
పయ్యావుల కేశవ్ విమర్శలకు తావివ్వకుండా అద్భుతంగా కౌంటర్లు ఇస్తుండటం ఆయనకు ప్లస్ అవుతోంది. పయ్యావుల కేశవ్ లా అద్భుతంగా సబ్జెక్ట్ మాట్లాడే నేతలు సైతం తక్కువగానే ఉన్నారు. పయ్యావుల కేశవ్ ను చూసి టీడీపీ నేతలు సైతం అదే విధంగా హుందాగా విమర్శలు చేస్తే కూటమి ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పయ్యావుల కేశవ్ రాబోయే రోజుల్లో మరింత మంచిపేరును సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: