* ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ పేరు ఒక బ్రాండ్ 
*ఎంపీ నుండి ముఖ్యమంత్రిగా తిరుగులేని నేతగా జగన్ రాజకీయ ప్రస్థానం
*ప్రత్యక్ష రాజకీయాలలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ పేరు సంచలనం అని చెప్పాలి.దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా 2009 లో ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టిన జగన్ కడప ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించాడు.అదే ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.కానీ అనూహ్యంగా అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు సంభవించింది.అభిమానులు ,కార్యకర్తలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా అప్పటి కేంద్రం లో వున్నా కాంగ్రెస్ పార్టీ కోనిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది.అదే సమయంలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఉదృతం చేయగా ఆ ఒత్తిడిని నిలువరించలేక రోశయ్య సీఎం పదవికి రాజీనామా చేసారు.ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ శాసన సభ స్పీకర్ అయినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని సీఎంని చేసింది.అదే సమయంలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు కూడా కాంగ్రెస్ అనుమతించకపోవడంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు.


2011 లో వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించారు.ఈ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది అలాగే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి చేరారు.దీనితో అప్పుడు జరిగిన ఉపఎన్నికలలో వైసీపీ ఏకంగా 16 ఎమ్మెల్యే ,2 ఎంపీ సీట్లు సాధించి సంచలనం సృష్టించింది.దీనితో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ కాంగ్రెస్ సిబిఐ ని రంగంలోకి దించింది.ప్రతిపక్షం టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు జగన్ ను అరెస్ట్ చేయించింది.దీనితో వైసీపీ పార్టీని జగన్ చెల్లెలు షర్మిల ముందుండి నడిపించారు.16 నెలలు జగన్ జైలులోనే గడిపారు.ఆతరువాత రాష్ట్రము రెండుగా విభజించబడటంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కనుమరుగైంది.దీనితో 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు సీఎం అయ్యారు .ఆ ఎన్నికలలో వైసీపీ 68 సీట్లకు పైగా సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.ఆతరువాత తండ్రి వలె పాద యాత్ర చేపట్టిన జగన్ 2019 ఎన్నికలలో సంచలన విజయం సాధించారు.ఏకంగా 151 సీట్లు సాధించి సంచలనమ్ సృష్టించారు.ఇలా ఎంపీ నుండి ఎమ్మెల్యే గా ,ముఖ్యమంత్రిగా జగన్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.కానీ అనూహ్యంగా 2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు సాధించి ఘోర పరాజయం అందుకుంది.ఓటమికి కృంగిపోని జగన్ రెట్టింపు వేగంతో దూసుకొస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: