దేశ రాజధాని ఢిల్లీ నగరంలో... భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం పూర్తిగా రావడం... కారణంగా నిన్నటి నుంచి... ఢిల్లీ మహానగరంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా... జోరుగా జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షాలని పద్యంలో ఢిల్లీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు... చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు కార్లు లేదా బైక్స్ ముందుకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా... నిన్న ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ అయింది.


చాలా చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. అయితే ప్రాణ నష్టం కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడమే కాకుండా... ఢిల్లీ ఎయిర్ పోర్ట్  లో కూడా నాన రచ్చ జరిగింది. ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లోని టర్మినల్ వన్  లో పై కప్పే కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఏకంగా ఆరుగురు  గాయపడడం జరిగింది. ఇందులో ముగ్గురు పరిస్థితి... విషమంగా ఉందని చెబుతున్నారు అధికారులు.


అయితే పైకప్పు కోలడంతో కింద ఉన్న కార్లు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన... ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే... దీనిపై మొట్టమొదటిసారిగా.. కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు...కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.

T1 ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని... T1 వద్ద ఉన్న బాధిత ప్రయాణికులందరికీ సాయం చేయాలని ఆదేశించామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు రామ్మోహన్నాయుడు. ఈ మేరకు వివిధ విమానయాన సంస్థలకు ఆదేశించామని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు రామ్మోహన్నాయుడు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు రామ్మోహన్నాయుడు.  ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: