ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎస్ గా పని చేసిన జవహర్ రెడ్డి ఎన్నికల సమయంలో పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని కొన్ని విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనుండగా రిటైర్మెంట్ ముంగిట పోస్టులు ఇచ్చే విషయంలో విషయంలో టీడీపీ సర్కార్ హుందాగా వ్యవహరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత జవహర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.
 
అయితే ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వకపోతే భవిష్యత్తులో పొందే బెనిఫిట్స్ కు సంబంధించి ఆయన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అవమాకరంగా పదవీ విరమణ చేసే పరిస్థితి రాకుండా టీడీపీ సర్కార్ ఆయనను  ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ.డబ్ల్యూ.ఎస్ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడంతో జవహర్ రెడ్డికి బెనిఫిట్ కలగనుంది.
 
జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పూనం మాలకొండయ్యకు సైతం సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. త్వరలో రిటైర్ కానున్న ఈ అధికారులను గౌరవంగా సాగనంపాలని కూటమి సర్కార్ భావించింది. గత ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నో ఇబ్బందులకు గురి చేయగా తమ ప్రభుత్వం మాత్రం అలా చేయదని బాబు తన పాలనతో చెప్పకనే చెబుతున్నారు.
 
అధికారులకు సంబంధించి విమర్శలకు తావు లేకుండా కూటమి సర్కార్ పాలన సాగించడం ద్వారా ఉద్యోగుల మెప్పు సైతం పొందుతున్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చేలా కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి పాలనను చూసి జగన్ సైతం కొన్ని విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు  తన మార్క్ పాలనతో ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: