* సీమలో మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎమ్మెల్యేలు  

* వారందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్న కేతిరెడ్డి  

* ఆయన ఓడిపోవడం ప్రజల దురదృష్టం  

(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కేతిరెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కానీ పోయినసారి ఆయన ఓడిపోయారు. దాదాపు 3,000 ఓట్లతో ఆయన ఓటమిని చవిచూశారు. నిజానికి కేతిరెడ్డి గెలుస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గడచిన ఐదేళ్లలో ఈ నేత ధర్మవరంలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే సాల్వ్ చేశారు.

పరీక్ష ఫీజు కట్టలేక చదువు మానేసిన ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు. పొట్టకూటి కోసం కష్టపడుతున్న ముసలాయన దగ్గర సరుకులంతా కొనేసి చాలా డబ్బులు ఇచ్చారు. ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ప్రజల మనసులను దోచేశారు. అక్కడ ఆయనకు తప్ప వేరే వారికి టికెట్ గెలవడం అసాధ్యమని జగన్ మళ్ళీ కేతిరెడ్డికే టికెట్ ఇచ్చారు. చాలా మంచి చేసినా ప్రజల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నా కేతిరెడ్డి ఈసారి ఓడిపోవడం జరిగింది. దీన్ని ఎవరూ నమ్మలేకపోయారు.

రియల్ మాస్ లీడర్ అంటే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు కానీ సైకిల్ గాలిలో ఆయనా కొట్టుకుపోయారు. కేతిరెడ్డి మిగతా ఎమ్మెల్యే లందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గానికి రారు ప్రజల సమస్యలను పట్టించుకోరు. ఎన్నికల ప్రచార సమయంలో మాత్రమే వస్తారు కొంతమంది నియోజకవర్గానికి మంచి చేస్తారేమో కానీ దాదాపు మిగతా వారందరూ కూడా గెలిచి ముఖం చాటేస్తారు. ఈ ఒక్క ఏపీలో మాత్రమే ఉన్న పరిస్థితి కాదు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి నాయకులు ఉన్నారు. వారందరికీ ఒక ఎగ్జాంపుల్ గా కేతిరెడ్డి నిలబడ్డారు. తెలంగాణలో కూడా కేతిరెడ్డిని సంక్షించేవారు ఎంతోమంది ఉన్నారు మీలాంటి ఎమ్మెల్యే మా ఊరికి వస్తే అంత బాగుంది సార్ అంటూ కోరుకునే వారి అందరూ ఉన్నారు. అలాంటి మాస్ ఇమేజ్ ఎమ్మెల్యే ఈసారి ఓడిపోవడం నిజంగా ప్రజల దురదృష్టం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: