పిఠాపురం నియోజకవర్గం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు  వర్మ అని చెప్పవచ్చు. వర్మ త్యాగం వల్లే పవన్ కళ్యాణ్ అంతటి  మెజారిటీతో గెలుపొంద గలిగారు. టిడిపి అధినాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు వర్మ తను పోటీ చేసే  నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి  పిఠాపురం వర్మకు  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆయన త్యాగానికి పెద్ద పదవి కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 ప్రస్తుతం ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలలో ఎవరిని నిలబెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో త్యాగం చేసిన వాళ్ళు, ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇదే తరుణంలో ఒక ఎమ్మెల్సీ స్థానం  పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రతిపాదన పెట్టారట. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విధంగా  పిఠాపురం వర్మాను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు పవన్ కళ్యాణ్  ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. 

వర్మ వల్లే పవన్ కళ్యాణ్ ఇంతటి స్థాయికి చేరాడు కాబట్టి ఆయనకు గిఫ్టుగా ఎమ్మెల్సీ స్థానంలో ఛాన్స్ ఇచ్చి  తన రుణం తీర్చుకోపో తున్నారట. ఈ విధంగా వర్మాను  ఎమ్మెల్సీ చేయడం కోసం మిగతా ఎమ్మెల్యేలు అందరు కూడా ఒప్పుకున్నారట. మరి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి మంత్రి పదవి కట్ట బెడతారా లేదంటే ఎమ్మెల్సీ తోనే సరిపెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక మరో ఎమ్మెల్సీ స్థానం ఎవరిని వరిస్తుంది అనేది  చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: