ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ చక్రం తిప్పే అవకాశం వచ్చింది. అదేంటి మొన్న ఎన్నికల్లో ఓడిపోతే... జగన్ చక్రం తిప్పడం ఏంటి అని అనుకుంటున్నారా...? నిజంగానే ఏపీలో కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం జగన్ కు వచ్చింది. ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న తాజా నిర్ణయంతో... ఈ అవకాశం జగన్ కు వచ్చింది. మొన్నటి వరకు... బిజెపికి అన్ని విధాల సహకారం అందించిన... మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారట.


దాదాపు 24 సంవత్సరాలుగా... ఒడిస్సా రాష్ట్రాన్ని ఏలారు  మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అయితే అలాంటి వ్యక్తిని... బిజెపి పార్టీ అత్యంత దారుణంగా ఓడించడమే కాకుండా... ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది.  దీంతో బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నవీన్ పట్నాయక్ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే రాజ్యసభలో బిజెపికి మద్దతు ఇవ్వకుండా... ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట.


ప్రస్తుతం బిజెపికి 11  రాజ్యసభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఏ బిల్లు పెట్టినా కచ్చితంగా.. ఇతరుల అవసరం ఉంటుంది. నవీన్ పట్నాయక్ పార్టీకి 9 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఆయన మొన్నటి వరకు సపోర్ట్ ఇచ్చారు. ఇక సైడ్ అయిపోనున్నారు. 2026 వరకు బిజెపి స్థానాలు పెరిగే ఛాన్స్ లేదు.  ఇటు టిడిపి రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా అప్పుడే అవుతుంది.


దీంతో బీజేపీ చూపు... జగన్మోహన్ రెడ్డి పైన పడింది. ఎందుకంటే బిజెపికి సమానంగా... 11 రాజ్యసభ స్థానాలను వైసిపి  పార్టీ కలిగి ఉంది.  నవీన్ పట్నాయక్ దూరం కానున్న నేపథ్యంలో జగన్ తో దోస్తానా చేసేందుకు మోడీ సిద్ధమయ్యారట.  2026 వరకు... జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకోవాలని.. బిజెపి భావిస్తోందట. ఒకవేళ ఇదే జరిగితే.. ఏపీలోనే కాదు కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పుతారని... అందరూ అంటున్నారు. మోడీతో దోస్తానా చేస్తే జగన్ కు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా తగ్గిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: