•టీడీపీ యువనేతగా రాయలసీమ మాస్ లీడర్ గా దూసుకుపోతున్న భరత్!
•2024 ఎన్నికల్లో భరత్ విజయానికి వణికిపోయిన వైసీపీ!
•ఏపీ టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న మంత్రి భరత్!


( కర్నూల్ - ఇండియా హెరాల్డ్ ): కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్త, టీడీపీ యువ నేత T.G. భరత్ 2014 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18,876 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి వైసీపీని బెంబేలెత్తించిన మాస్ లీడర్ అయ్యాడు. కర్నూలు జిల్లా నుంచి భరత్ ఒక్కడికే ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. భరత్ తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మంత్రిగా పని చేసిన చరిత్ర ఉంది. ఆయన చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసి సేవలందించారు.టీజీ భరత్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు చాలానే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు.


ఆ టైములో సామాజిక సమీకరణాలను కన్సిడర్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ నేతలతో ఎన్నో చర్చల తర్వాత ఆయనకు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. భరత్ మంత్రి అయ్యాక కర్నూలులో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారంటే భరత్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఈసారి టీ.జీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక, యువజన, క్రీడల శాఖకు మంత్రి అయ్యారు. భరత్ బాగా చదువుకున్న లీడర్. విదేశాల్లో చదువుకొని చాలా నాలెడ్జ్ సంపాదించారు. ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషన్ గా దూసుకుపోతున్నారు. కాబట్టి ఈ శాఖలో ఉన్న సవాళ్లను ఆయన ఈజీగానే ఎదుర్కొగలరు. ఏపీ టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేయగల సామర్థ్యం భరత్ కి ఉంది. ఇక క్రీడలు, యువత విషయంలో కూడా భరత్ తీసుకునే నిర్ణయాలు ఏపీని ముందంజలో ఉంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: