- చిన్న వ‌య‌స్సులోనే రెండుసార్లు ఎమ్మెల్యే, మంత్రి
- ఢీ అంటే ఢీ అనే రాజ‌కీయాల్లో ఆరితేరిన అఖిల‌ప్రియ‌
- 2019 ఓట‌మి త‌ర్వాత కాస్త త‌గ్గి 2024లో విజ‌యం

( క‌ర్నూలు - ఇండియా హెరాల్డ్ )

భూమా అఖిల ప్రియ‌. క‌ర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి వార‌సురాలిగా.. అరంగేట్రం చేసిన ఈమె తొలి నాళ్ల‌లో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. 2014లో వైసీపీలో ఉన్న ఈ కుటుంబం.. అంత‌కు ముందు.. టీడీపీలోనే కొన‌సాగింది. వైఎస్ జ‌గ‌న్ ఆహ్వానంతో ఆ పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి దంప‌తులు .. 2014లో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల టికెట్ల‌ను తెచ్చుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భూమా స‌తీమ‌ణి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. దీంతో వైసీపీ.. భూమా అఖిల‌ప్రియ‌కు టికెట్ ఇచ్చింది.


ఆ త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అఖిల ప్రియ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత‌..జ‌గ‌న్ వైఖ‌రితో విసిగిపోయిన‌.. భూమా కుటుంబం టీడీపీ బాట ప‌ట్టింది. ఈ క్ర‌మంలో నాగిరెడ్డి కూడా హ‌ఠాన్మ ర‌ణం చెందారు. దీంతో చంద్ర‌బాబు ఈ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే క్ర‌మంలో ఆళ్ల‌గ‌డ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియ‌కు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఇదిలావుంటే.. మంత్రిగా మారిన త‌ర్వాత‌.. అఖిల ప్రియ ఫైర్ గా కూడా.. అవ‌తారం ఎత్తారు.


ఇది.. గ‌త ఐదేళ్ల‌పాటు ఆమెకు ఇబ్బందిగానే మారింది. సొంత నాయ‌కుల‌పైనే ఆమె పోరు సాగించాల్సి వ‌చ్చింది. గ‌తంలో కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి కంట్లో న‌లుసుగా మార‌డం.. ఆయ న‌ను ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా అఖిల ప్రియ‌.. ఎదుర్కొన‌డం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో హైద‌రాబాద్ భూముల కేసులో జైలుకు కూడా వెళ్లాల్సి వ‌చ్చింది. త‌ర్వాత కాలంలో పార్టీలోనూ నాయ‌కులు ఆమెకు దూర‌మ‌య్యారు. దీంతో త‌న ఫైరే త‌న‌కు ప్ర‌ధాన ఇబ్బందిగా మారింద‌ని తెలుసుకున్నారు.


ఈ క్ర‌మంలో గ‌త ఏడాది నుంచి ఫైర్ త‌గ్గించిన అఖిల ప్రియ‌.. బ్రాండ్ ను కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిం చారు. పార్టీ నాయ‌కుల‌ను క‌లుపుకొనిపోవ‌డం.. పార్టీని డెవ‌ల‌ప్ చేసుకోవ‌డం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కుగ్రాఫ్ పుంజుకుంటుందా? అని భావించిన నాయ‌కులు కూడా.. అఖిల ప్రియ‌లో మార్పులు చూసిన త‌ర్వాత‌.. ఆమెకు చేరువయ్యారు. ఆమెతో క‌లిసి ప‌నులు చేయ‌డం ప్రారంభించారు. తాజా ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యానికి ఇదే కార‌ణంగా మారింది. మ‌రి ఈ బ్రాండ్‌ను కొన‌సాగించాల‌ని పార్టీ నాయ‌క‌త్వం కూడా కోరుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: