వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ప్ర‌స్తుత కూట‌మి జోరులోనూ.. విజ‌యంద‌క్కించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మైండ్ బ్లాంక్ అయ్యిందా? ఆయ‌న కూసాలు క‌ద‌లించేలా.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో .. త‌న‌ను ఓడించి తీరుతాన‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు పెద్దిరెడ్డి స‌వాల్ చేసిన విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఆప‌రేష‌న్ పెద్దిరెడ్డిని చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.


తాజాగా.. పెద్దిరెడ్డి కంచుకోట‌.. పుంగనూరులో మునిసిపల్ ఛైర్మన్ గా ఉన్న‌ ఆలీంబాషాతో పాటు 11 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా  చేశారు. ఈ ప‌రిణామం వైసీపీ సీనియ‌ర్ నేత‌ పెద్దిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. `పేరుకు మాత్రమే నేను మునిసిపల్ ఛైర్మన్, పెత్తనం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబాని దే` అంటూ ఆలీంబాషా బహిరంగ ఆరోపణలు చేశారు. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఈయ‌న పెద్దిరెడ్డికి అనుచ‌రుడుగా ఉన్నారు. ఆయ‌న ఆశీస్సుల‌తోనే మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని
ద‌క్కించుకున్నారు.


ఈ క్ర‌మంలో తాజాగా.. చంద్ర‌బాబు కుప్పంలో ప‌ర్య‌టించిన త‌ర్వాత‌.. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా ర‌హ‌స్య భేటీ నిర్వహించిన త‌ర్వాత‌.. బాషా ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం.. పెద్దిరెడ్డి వ‌ర్గంలోనూ క‌ల‌క‌లం రేపింది. అంతేకా దు.. ఇంతకాలం తెలుగుదేశం జెండా పట్టుకుని వెళ్లాలంటే భయపడే టీడీపీ నాయకులు ఇప్పుడు పెద్ది రెడ్డికి దెబ్బ కొట్టడానికి ఏకంగా పుంగనూరు మునిపల్ ఛైర్మన్ ఆలీంబాషాతో పాటు 11 మంది వైసీపీ కౌన్సి లర్లతో రాజీనామా చేయించ‌డంతో కూసాలు కదులుతున్నాయా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది.


పెద్దిరెడ్డి నియోజక వర్గంలో పుంగనూరు ఒక్కటే మునిసిపాలిటీ. పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టడానికి పుంగనూరు మునిసిపాలిటీనే టార్గెట్ చేసుకున్న చంద్రబాబు అనుకున్నది సాధించారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా యి. పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే ఆలీంబాషా పుంగనూరు మునిసిపల్ ఛైర్మన్ అయ్యాడు. ఇప్పుడు అదే మున్సిపల్ ఛైర్మన్ ఆలీంబాషా నోటీతోనే పెద్దిరెడ్డి ఓ నియంత అని చెప్పించడంలో టీడీపీ నాయకులు సక్సస్ కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: