భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ రేంజ్ లో విడుదలైన కల్కి 2898 ad మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో మోత మోగించింది. అయితే ఈ సినిమా చూసిన చాలా మంది జనాలు నాగ్ అశ్విన్ ని మెచ్చుకోకుండా ఉండలేరు. అంతేకాదు చాలామంది ఈ సినిమా ను చూస్తూ నీ దర్శకత్వ ప్రతిభ ఏంట్రా బాబు ఊహకి అందని రేంజ్ లో విజువల్స్ చూపించావు. ఏం తాగి దర్శకత్వం చేసావురా నాయనా .. అంటూ మూవీ చూసిన జనాలు రివ్యూల మీద రివ్యూలు ఇస్తున్నారు. కల్కి మొదటి రోజు దాదాపు 180 కోట్ల కు పైగా కలెక్షన్లను వసూలు చేసిందట. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు  కొడుతుంది.

 అదేంటంటే ఈ సినిమా లో అతిధి పాత్ర లో నటించిన మృణాల్ ఠాకూర్ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోకుండానే నటించిందట.. కల్కి మూవీ ప్రారంభం లోనే మృణాల్ ఠాగూర్ గినియా అనే పాత్ర లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా లో గెస్ట్ రోల్ చేసిన చాలా మంది సెలబ్రెటీలు రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ మృణాల్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఆశించలేదట. దానికి ప్రధాన కారణం.. మృణాల్ ఠాకూర్ తెలుగు లో వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన సీతారామం సినిమా తోనే  పాపులర్ అయింది.

అయితే అంతకు ముందు హిందీ లో ఎన్ని సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు ఈ ఒక్క తెలుగు మూవీ తోనే వచ్చేసింది. దాంతో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఉన్న ప్రేమాభిమానాలతోనే కల్కి సినిమా లో మృణాల్ ఠాగూర్  గెస్ట్ రోల్ కి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే నటించిందని ఫిల్మ్ సర్కిల్స్ నుండి ఓ రూమర్ వినిపిస్తుంది. ఇక దీనిలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: