ఏపీలో వైసీపీ అధికారంలో కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు, నేతలపై కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ తరుణంలోనే వైసీపీ నేతలకు మరో షాక్‌ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధం అయిందని సమాచారం. గత ప్రభుత్వంలో జరిగిన హింసాత్మక ఘటనలు, రాజకీయ వేధింపులపై ప్రభుత్వ పెద్దల ఆరా తీస్తున్నారట. రాజకీయ అండతో గత ప్రభుత్వ పెద్దలు సామాన్యులను ఇబ్బంది పెట్టిన ఘటనలపై ఫోకస్ పెడుతున్నారని సమాచారం అందుతోంది.


రేపల్లె అమర్నాధ్ గౌడ్, నంద్యాల అబ్దుల్ సలాం, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలు తెప్పించుకుంటోందట చంద్రబాబు ప్రభుత్వం. ఆయా కేసుల స్టేటస్ ఇవ్వాలని సీఎంఓ ఆదేశించారట. దీంతో సీఎంఓ పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోందట పోలీస్ యంత్రాంగం. వైసీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం పైనా దృష్టి పెడుతోన్న కూటమి ప్రభుత్వం...వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తుందని సమాచారం.

 

పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగి నాటి అధికార దుర్వినియోగంపై డేటా సేకరణ కూడా చేస్తోందట. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులపై విచారణ మొదలైనట్టు సమాచారం అందుతోంది. దాడులకు కారణమంటూ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ వంటి వారిపై గతంలోనే అభియోగాలు ఉన్నాయని గుర్తించారట.



గతంలో అక్రమ కేసులు బనాయించడం వెనుకున్న పెద్దలనూ విచారించేందుకు సిద్దమవుతోన్న పోలీసులు.... కొల్లుపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని మీద ఆరోపణలు ఉన్నట్లు తెరపైకి తీస్తున్నారు. తనను చంపేయాలని ఆదేశించారంటూ సజ్జలపై ఉద్యోగ సంఘ నేత సూర్య నారాయణ విమర్శలు చేసిశారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల భయంతో ఫిర్యాదు చేయడానికి భయపడ్డ వారు.. ఇప్పుడు వస్తున్నారంటోంది ఏపీ హోం శాఖ. గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై నివేదికలు కోరిందట ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: