ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ సభ కొనసాగుతుండగా.. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోతుంది. అనుకుంటున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టాడు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే అతను టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇక పార్టీలో ఎంత మార్పును తీసుకువచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సీనియర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న అతను మాత్రం కార్యకర్తలు అందరిని కూడా ఒక్కతాటిపై నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు.


 ఈ క్రమంలోనే కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీని.. మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాదు ఇక సీనియర్లను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి సీఎం కూర్చుని అప్పజెప్పే విధంగా తన హవా నడిపించారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా కాంగ్రెస్ లోకి రాకమందు అటు రేవంత్ రెడ్డి టిడిపిలో కొనసాగారు అన్న విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబుకు శిష్యుడిగా వీరాభిమానిగా ఆయన ప్రస్థానం సాగింది


 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన విజయం సాధించి సీఎం సీటులో కూర్చున్నప్పటికీ.. ఇంకా తన పాత పార్టీ అయిన టిడిపి పై ప్రాంతం రేవంత్కు ప్రేమ తగ్గలేదు అనే టాక్ అప్పుడప్పుడు  వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇదే అనిపిస్తుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోమోనని.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. టిడిపి 10% ఓట్లు దక్కించుకునేదని.. అప్పుడు తమ పార్టీ గెలుపోటములపై ఖచ్చితంగా ప్రభావం చూపేది అంటూ వ్యాఖ్యానించాడు. తెలంగాణలో కెసిఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్లే దెబ్బ తిన్నారు అని చెప్పుకొచ్చారు. అయితే బిఆర్ఎస్ ను ఓడించడం, సీఎం కావడం, కేసీఆర్ ను గద్దె దించటం అనే నా రాజకీయ మూడు లక్ష్యాలు నెరవేరాయి అని చెప్పుకొచ్చాడు. తమ పార్టీని వేనకేసుకు రాకుండా.. పాత పార్టీ టీడీపీ గురుంచి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: