తెలంగాణ రాష్ట్రంలో కొత్త టీపీసీసీ  ఎంపికలో గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోంది. ఈ పదవి ఎవరికి ఇస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు అనేది  ప్రస్తుతం చెప్పడం కష్టంగానే ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డికి వారసుడు వారే అంటూ అనేక వార్తలు మీడియా లో వినిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఏమంటుంది.. సీఎం రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. జూన్ 27 నాటికి టీపీసీసీ చీఫ్ పదవీకాలం ముగిసింది. ఈయన టిపిసిసి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.  అలాంటి టీపీసీసీ రేవంత్ లాంటి మరో సమర్ధవంతుడైన నాయకునికే టీపీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందట.. రాష్ట్రంలో పవర్ లో ఉన్న పార్టీ కాబట్టి టిపిసిసి కి మంచి ఆదరణ ఉంటుంది.

 దీంతో కాంగ్రెస్లో ఉండేటువంటి చాలామంది సీనియర్లు ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం రావడంతో పార్టీ మరో సామాజిక వర్గానికి టీపీసీసీ ఇవ్వాలని చూస్తున్నారు. పార్టీ చీప్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని ఓ ఆలోచన చేస్తున్నారట. ఎమ్ఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి. లేకపోతే టీపీసీసీ పదవి ఇవ్వమని కొట్లాడుతున్నారు.  అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ పదవి కోసం లాబీయింగ్ లు చేస్తున్నారు. సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ మధుయాష్కీ గౌడ్ లు కూడా ఈ పదవి కోసం కొట్లాడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎంపీ మల్లు రవి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం బట్టి కూడా ఈ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్లో ఎంతో సీనియర్ లీడర్లు టిపిసిసి పదవి కోసం కొట్లాడుతుండడంతో ఎవరిని నియమించాలనేది హై కమాండ్ కు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా టీపీసీ పదవి పొందితే చాలా ఓపికగా మాట్లాడుతూ పార్టీ చెప్పిన పనులన్నీ చేయాల్సి ఉంటుంది.  అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పదవులు పొందిన నాయకులకు మరియు టీపీసీసీ మధ్య ఒద్దిక కుదుర్చుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పార్టీలో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అందరితో కలిసి అందరినీ కలుపుకుపోయే ఓపికగా ఉండే నాయకుడి కోసం అధిష్టానం సెర్చ్ చేస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి టీపీసీసీ పదవి ఇస్తే ప్రభుత్వంను వదిలి బయటికి వచ్చేయాలని భట్టి విక్రమార్క చూస్తున్నారట.మరి చూడాలి రేవంత్ రెడ్డి మదిలో ఎవరున్నారు.. అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: