ఆంధ్రప్రదేశ్లో వైసిపి కార్యాలయాలకు తాజాగా వరుసగా నోటీసులు ఏపీ ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది. ఇటీవల రెండు ఆఫీసులను సైతం అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసిపి పార్టీ హైకోర్టును సైతం ఆశ్రయించింది.. గత పిటిషన్లకు అటాచ్మెంట్ చేస్తూ తీర్పు రిజర్వు చేసినట్లు హైకోర్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువగా వైసీపీ కార్యాలయాల కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. గత వైసిపి ప్రభుత్వంలో నిర్మించిన జిల్లాలలోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వైసిపి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ సైతం దాఖలు చేసింది.


ఈ రెండు పిటిషన్లను సైతం విచారించిన హైకోర్టు గత పిటిషన్లకు సైతం ట్యాగ్ చేస్తూ తీర్పు రిజర్వుడు చేసినట్లు తెలుస్తోంది.అయితే తాజా పిటిషన్ల పైన కూడా కొనసాగింపు ఉంటుందన్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే అధికారులు నోటీసుల పైన వైసిపి హైకోర్టును ఆశ్రయించడంతో సుమారుగా 16 ఆఫీసుల పైన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.. అక్రమంగా నిర్మించారని నిబంధనలు పాటించలేదని ప్రభుత్వ భూములు అన్యాయంగా ఆక్రమించారని కార్యాలయాలకు నోటీసులను జారీ చేశారు అధికారులు.గుంటూరు జిల్లా తాడేపల్లి లో వైసీపీ కేంద్ర కార్యాలయం తో సహా మరికొన్ని ప్రాంతాలలో కూడా వైసిపి ఆఫీసులను సైతం కూలిచివేశారు



దీంతో వైసిపి పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి తీర్పుని రిజర్వ్ చేసింది.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ 16 వైసీపీ కార్యాలయాల నోటీసులకు సైతం స్టేటస్ కో ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను సైతం రాజకీయ కక్షతోనే కూల్ చేస్తున్నారు అంటూ వైసీపీ పార్టీ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం నుంచి వాదిస్తున్న ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ ప్రస్తుతం నిర్మాణాల పైన క్లారిటీ ఇవ్వాలని మాత్రమే అధికారులకు నోటీసులు ఇచ్చామంటూ తెలిపారు.. వాటికి తగ్గ సమాధానం ఇస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా వైసిపి పిటిషన్లకు విచారణ అర్హత లేదని శ్రీనివాస్ తెలిపారు. మరి హైకోర్టు ఎవరికి తీర్పు అనుకూలంగా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP