జబర్దస్త్ అనే షో ద్వారా కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఈటీవీలో ప్రసారమయ్యే ఇతర షోలలో మాత్రం సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హైపర్ ఆది కొన్ని సినిమాలకు కూడా రచయితగా పనిచేశారు. తన డైలాగ్స్ తో అందరిని మెప్పించాడు అని చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో అటు రాజకీయ వ్యవహారాల్లో కూడా చురుకుగా ఉంటున్నాడు హైపర్ ఆది.


 ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనక పోయినప్పటికీ ఇక తన అభిమాన నాయకుల తరఫున ఎంతో పవర్ఫుల్ స్పీచ్ లు ఇస్తూ ఎప్పుడు టాక్ ఆఫ్ పాలిటిక్స్ గా మారిపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా గత కొంతకాలం నుంచి పాలిటిక్స్ కు సంబంధించి స్పీచ్ లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు ఈ మాజీ జబర్దస్త్ కమెడియన్. ఇక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏకంగా జనసేన పార్టీలో చేరబోతున్నారట. జూలై మొదటి వారంలోనే అతను జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.


 అయితే హైపర్ ఆది జనసేన తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనక పోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి ఆది ఇచ్చిన స్పీచ్ లు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయ్. దీంతో పవన్ కళ్యాణ్ గెలవడంలో ఆది కూడా తనవంతు పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఇలా జనసేన పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన హైపర్ ఆదికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్ చేసిందట ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టబోతున్నారట. దీంతో ఈ విషయం తెలిసి హైపర్ ఆది జాక్ పాట్ కొట్టేసాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాగా హైపర్ ఆది సహా మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా అటు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కొన్ని రోజుల పాటు ఉండి ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: