ఆముదాలవలస వాస్తవంగా ఇక్కడ ఇద్దరు బంధువులే.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్.. అలాగే కూన రవికుమార్. ఇద్దరి మధ్య పోరాటమే నడుస్తూ ఉంటుంది. క్రిందటి సారి రవికుమార్ ని ఓడించి అటు తమ్మినేని సీతారామ్ గెలిస్తే ఇప్పుడు మళ్ళీ.. తమ్మినేని సీతారామ్ మీద రవికుమార్ గెలిచారు. వాస్తవంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తి కూన రవికుమార్. మంచి సబ్జెక్టు ఉన్నటువంటి కూడా నాయకుడు. బలహీనమైన వర్గాల నుంచి వచ్చిన బలమైన నాయకుడిగా పేరు పొందారు. ఎలాంటి విషయాలలోనైనా సరే పాయింట్ టు పాయింట్ గా మాట్లాడగలరు.


అయితే కూన రవికుమార్ మంత్రి పదని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ.. మంత్రి పదవి రాలేదు.. ఇదే కారణమా లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా అనే విషయం తెలియదు కానీ.. ప్రస్తుతం కూన రవికుమార్ తన గన్మెన్లను సైతం వెనక్కి పంపించారని.. తనకు ఎవరు శత్రువులు లేరని తనకు ఎలాంటి రక్షణ కూడా అవసరం లేదని చెప్పారట. కలింగ సామ్రాజ్య వర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత అసంతృప్తి ఉందని రవికుమార్ ఈ విధంగా బయట పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తనకు శత్రువులు ఎవరూ లేరని రక్షణగా ఎవరు అవసరం లేదని కూడా తెలిపారట.



తాను అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువగా బలంగా పనిచేశానని.. ప్రజల్లో నిత్యం ఉన్నానని.. తనకు గన్ మ్యాన్ ల అవసరం లేదని.. వారిని తిప్పి పంపడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే రవికుమార్ మాత్రం పార్టీతో గొడవ పెట్టుకునే వ్యక్తిత్వం మనిషి కాదని చెప్పవచ్చు.. ఆయన ఎప్పుడూ కూడా బాధ్యతగానే గుండె మనిషిని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో నైనా ఈయనకు మంత్రి పదవి ఇచ్చేలా టిడిపి ప్రభుత్వం భావిస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా కూటమిలో భాగంగా చాలామంది మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: