తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో... ఇవాళ ఉదయం... తీవ్ర విషాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు... మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న... డి శ్రీనివాస్ ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా... తీవ్ర అనారోగ్యంతో ధర్మపురి శ్రీనివాస్ బాధపడుతున్న సంగతి తెలిసిందే.

 

తరచూ ఆయనను... ఆయన చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్తున్నారు. అయితే శనివారం రోజున ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం విషమించడంతో... తుది శ్వాస విడిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా అలాగే పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్... నిజామాబాద్ లో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన లీడర్.

 

1989, 1999, 2004 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం అంటే.... 2004 అలాగే 2009 ఎన్నికల్లో... పిసిసి అధ్యక్షులుగా డిఎస్ పని చేశారు. ఆ సమయంలో..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావాలని ఆయనకు బాగా ఆశ ఉండేదట. కానీ ఈయన సామాజిక వర్గం కాపు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాకుండా...  రెడ్డి సామాజిక వర్గానికి నాయకులు... అడ్డుకున్నారట.

 

దీంతో ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో... వివాదాలు కామన్. అందుకే డి శ్రీనివాస్ కూడా లైట్ తీసుకున్నారట. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత... గులాబీ పార్టీలో చేరిన డి శ్రీనివాస్... వెంటనే రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ మొన్న  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉండగా... అందులో ఒకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: