ప్రత్యేక తెలంగాణ కోసం అత్యంత పోరాటం చేసిన వ్యక్తులలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్ ఎస్) అనే పార్టీని ప్రత్యేక తెలంగాణ రావడం కోసమే స్థాపించాడు. ఇక పార్టీ స్థాపించిన తర్వాత ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ నిరాహార దీక్ష ఫలితం , దానికి జనాలు తోడుగా నిలవడంతో 2014 వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఆ తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో (టి ఆర్ ఎస్) పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. దానితో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 2018 వ సంవత్సరం కూడా కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం (బీ ఆర్ ఎస్) పార్టీ కి ఎదురు దెబ్బ తగిలింది. ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కలేదు.

ఇకపోతే మొదటి నుండి కూడా కేసీఆర్ పై కొన్ని నెగటివ్ అంశాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది ఎప్పుడు జనాల మధ్యలోకి రాడు. ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. ఎవరైనా ఎమ్మెల్యేలు , మంత్రులు వచ్చినా కూడా వారిని కలవడానికి అసలు ఇష్టపడరు, పెద్దగా మాట్లాడరు. ఇలాంటి కామెంట్స్ కెసిఆర్ పై వినిపిస్తూ ఉంటాయి. ఇక ఓటమి తర్వాత కూడా కేసీఆర్ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఓడిన తర్వాత ఒక సారి కూడా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ప్రజా సమస్యలపై మాట్లాడలేదు. ఇక ప్రస్తుతం కూడా ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు.

పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్న పెద్దగా పట్టించుకోవడం లేదు. జనాలలో మమేకం అయ్యి జనాలతో ఉండడం లేదు. ఇక మళ్లీ కేసీఆర్ ఇలాగే ప్రవర్తిస్తూ వెళితే వచ్చే ఎన్నికలలో కూడా (టి ఆర్ ఎస్) పార్టీ పుంజుకోవడం కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కెసిఆర్ వచ్చే ఎలక్షన్ల వరకు ఇలాగే ప్రవర్తిస్తాడా లేక ప్రజలతో మమేకం అవుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: