- అద్భుత ప్లాన్ తో రంగంలోకి దిగిన బిజెపి..
- వర్కవుట్ అయితే కేసీఆర్ పార్టీ ఖతం..
- 2028 లో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ.!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎంతో కష్టపడి బీఆర్ఎస్ చేసిన తప్పులపై ప్రశ్నించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. దీంతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఆయన ముందుకు వెళ్లడంతో కాంగ్రెస్ విజయం ఖరార్ అయింది. మొత్తం 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇక బిజెపి 8 సీట్లు, ఏఐఎంఐఎం 7, సిపిఐ 1 సీటు సాధించింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్యారెంటీల అమలు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అద్భుతంగా మూడు గ్యారెంటీల అమలుతో దూసుకుపోతోంది. రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కూడా త్వరలో అమలు కానుంది. ఇదే తరుణంలో 2024 పార్లమెంటు ఎలక్షన్స్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఇదే తరుణంలో బిజెపి పార్టీ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ తో సమానంగా సీట్లు సాధించింది. దీంతో రాష్ట్ర బిజెపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొన్నది. ఇలా 2019 ఎన్నికల నుంచి మొదలు 2024 ఎన్నికల వరకు బిజెపిలో చాలా వరకు మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం కుల, మత రాజకీయాలు చేయడమే.. బీఆర్ఎస్ ఉన్న సమయంలో ముఖ్యంగా దొరలకే పెద్ద పీట వేసి పాలన చేశారు కేసీఆర్. చివరికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నేలకేసి కొట్టారు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా రెడ్డిలకే పెద్ద పీట వేస్తుందని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్ లో రెడ్డిలకే ఎక్కువ పదవులు వచ్చాయనే ఆలోచన కూడా జనాల్లో ఉంది. వీటినే ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నటువంటి బిజెపి హిందువులందరినీ ఏకం చేసి, రెడ్డి, రావుల రాజకీయానికి చరమ గీతం పాడాలని చూస్తోంది. బీసీ నినాదం, ఎస్సీ నినాదం పేరుతో అనేక రాజకీయాలు చేస్తోంది.

 టార్గెట్ 2028:
 ఇక బిజెపి  తాను అనుకున్నది తెలంగాణలో చేస్తోంది. దాదాపు పది సంవత్సరాల క్రితం కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి బిజెపి, ఈ పది సంవత్సరాల్లో ఎంతో పుంజుకుందని చెప్పవచ్చు. ఇదే తరుణంలో రాబోవు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా బిజెపి కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది.  బీఆర్ఎస్ ను పూర్తిగా బిజెపి వైపు తిప్పుకోవాలనే ప్లాన్ లో ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కొత్త అధ్యక్షుడు కోసం కసరత్తు మొదలుపెట్టింది. కుల, సామాజిక వర్గాలు ఇలా అన్ని అంశాలను కలగలిపిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తుందట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  ఈటెల రాజేందర్. ఈయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో కృషి చేశారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు.  అలాగే కేబినెట్ లో ఎన్నో మంత్రి పదవులు సాధించారు.  అనుభవం కలిగినటువంటి ఈ నేతకు అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం బీఆర్ఎస్ లో ఉండే తన పాత మిత్రులందరిని బిజెపిలోకి రప్పించి  2028 ఎలక్షన్స్ వరకు బీఆర్ఎస్ లేకుండా చేసి  ఆ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకునే అవకాశం మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విధంగా బిజెపి ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం  రాబోవు ఎన్నికల్లో తప్పక బీజేపీ విజయం సాధిస్తుందని అంటున్నారు.  అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా అన్ని ప్లాన్స్ వర్కవుట్ అయితే మాత్రం బిజెపికి 2028లో తిరుగు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: