*రాష్ట్రంలో బిఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు
*పదేళ్ల పాటు చక్రం తిప్పిన కేసీఆర్ సైలెంట్ అవ్వడానికి కారణం అదేనా?
*ముఖ్యమంత్రి కావాలన్న కేటీఆర్ కల కలగానే మిగిలిపోతుందా..?

తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితంగా ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ప్రత్యేక రాష్ట్ర కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులు వారి ప్రాణాలను త్యాగం చేసారు. ఎంతో మందిని అరెస్ట్ చేసారు. అయిన ఉద్యమం ఆగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా శ్రమించి ఎట్టకేలకు సాధించుకున్నారు.తెలంగాణ ఉద్యమం లో కెసిఆర్ చురుకుగా పాల్గొన్నారు. అప్పటి వరకు టీడీపీ లో కీలక నేతగా వున్న కెసిఆర్ 2001 లో దేశంలో కొత్తగా ఉత్తరఖాండ్, ఛత్తిస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కూడా సాధ్యమేనని భావించి టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని 2001 లో స్థాపించారు. అప్పటి నుండి బంగారు తెలంగాణ సాధనకై పోరాడారు.. కేంద్రంలోకి యూపీఏ ప్రభుత్వం రావడంతో ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఉద్యమించారు. 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ ఉదృతం చేసారు. బంద్ లు, రాష్ట్రారోకోలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. అలాగే సమైక్యాంధ్రా ఉద్యమం కూడా ఊపందుకుంది. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనితో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.. కేంద్రానికి ఇక చేసేదేమి లేక ప్రత్యేక తెలంగాణ ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావించింది.

2014 తెలంగాణ లో జరిగిన సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కెసిఆర్ కొడుకు సిరిసిల్ల నుంచి విజయం సాధించి ఐటీ మినిస్టర్ అయ్యారు.ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారు. బంగారు తెలంగాణ సాదింఛామని మన బ్రతుకులు బాగుపడతాయని ప్రజలలో కెసిఆర్ చైతన్యం కలిగించారు. అలాగే ఐటీ శాఖ మినిస్టర్ గా కేటీఆర్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. రాష్ట్రానికి వరుసగా పెట్టుబడులు తీసుకువచ్చారు..అప్పటికే డెవలప్ అవుతున్న రాజధాని హైదరాబాద్ లో ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేలా కృషి చేసారు.తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించింది.తెలంగాణాలో మాత్రమే కాదు దేశం అంతా చక్రం తిప్పాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు.

 దేశ రాజకీయాలలో కెసిఆర్ బిజీ గా ఉంటే తెలంగాణ భాద్యతలు కేటీఆర్ కు అప్పగిస్తారని అప్పట్లో ఒక న్యూస్ వైరల్ అయింది..కేంద్రంలో ఏన్డీయేను గద్దె దించాలనే ఉద్దేశంతో కెసిఆర్ భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసారు. కానీ రాష్ట్రంలో తీవ్ర నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలు వంటివి కెసిఆర్ ను దెబ్బకోట్టాయి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఇక అక్కడి నుంచి బిఆర్ఎస్ పార్టీకి వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీలో కీలక నేతలందరు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.అలాగే ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక బిఆర్ఎస్ పని అయిపోయినట్లే ని అంతా భావిస్తున్నారు. ఈ ఐదేళ్లలో బిఆర్ఎస్ పుంజుకునే దారులే కనబడుటలేదు..దీనితో కేటీఆర్ ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది.. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: