కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారాన్ని దక్కించుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ పార్టీ ఇంకా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రం సరైన పట్టు సాధించుకోలేకపోతోంది. అలాంటి రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణలో పట్టు సాధించాలని బిజెపి పెద్దలు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు   ఎంతలా అంటే కేవలం  జిహెచ్ఎంసి లాంటి చిన్న ఎన్నికల సమయంలోనే మోడీ, యోగి లాంటి బీజేపీ కీలక నేతలు బరిలోకి దిగి ప్రచారం నిర్వహించారు. దీన్ని బట్టి ఇక తెలంగాణలో పట్టు కోసం బిజెపి ఎంత ప్రయత్నాలు చేస్తుందో అందరికీ అర్థం అయిపోయింది.


 ప్రయత్నాలు చేయడమే కాదు అంతకంతకు పట్టు సాధిస్తూ ముందుకు సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల విజయం సాధించింది  అయితే ఇది చెప్పుకోవడానికి తక్కువే అయినా.. గతంతో పోల్చి చూస్తే ఎక్కువ స్థానాలే సాధించింది. ఇక మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 స్థానాల్లో విజయ డంక మోగించింది. ఇలా క్రమక్రమంగా తెలంగాణలో బిజెపి పట్టు పెరుగుతుంది అన్నది అర్థమవుతుంది. అయితే తెలంగాణ సాధించింది అన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్ పతనమయ్యే పరిస్థితి ఉంది అన్నది ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.


 ఇక కాంగ్రెస్ కూడా వన్ టైం వండర్ అన్న విధంగానే ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారట. దీన్ని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక బిజెపిని తెలంగాణ ఫ్యూచర్ గా మారుతుందని అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి అంతకంతకు పట్టు సాధిస్తున్న తీరు చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ  మోడీ మేనియా వల్లే తెలంగాణలోబిజెపికి ఆదరణ లభిస్తుంది. కానీ ఒకవేళ మోడీ ప్రధానిగా లేకపోతే.. తెలంగాణ రాజకీయాల్లో బిజెపి పరిస్థితి ఏంటి అన్నది కూడా అందరిలో నెలకొన్న ప్రశ్న. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp