తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై... బిజెపి పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో... రెండవ స్థానానికి కోసం బిజెపి పార్టీ వ్యూహరచనలు చేస్తోంది. ఇప్పటికే రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన బిజెపి... తెలంగాణకు మరిన్ని నిధులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. మరోసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన.. లీడర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకుంటోంది.

 

ఇక తాజాగా కేంద్ర బిజెపి అధిష్టానం... తెలంగాణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకుందట. అదేంటంటే తెలంగాణకు  కొత్త గవర్నర్ ను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందట. ఆ దిశగా కేంద్ర బిజెపి అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు... సోము వీర్రాజును...  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందట మోడీ ప్రభుత్వం. మొన్న జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో... సోము వీర్రాజుకు అన్యాయం జరిగింది.


ఆయన రాజ్యసభ ఎంపీ టికెట్ అడిగారు. ఎంపీ టికెట్ కాదు కదా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే సోము వీర్రాజు బిజెపి కోసం చేసిన  సేవలను గుర్తించి... ఇప్పుడు ఆఫర్ ఇచ్చిందంట. తెలంగాణ గవర్నర్గా సోము వీర్రాజును పంపించేందుకు సిద్ధమైందట. వాస్తవానికి తెలంగాణ గవర్నర్గా కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోబోతుందనే నేపథ్యంలోనే... గులాబీ పార్టీ విరుచుకుపడింది.

 తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వ అన్న  కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియా వేదికగానే స్పందించింది గులాబీ పార్టీ. దీంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. kiran kumar REDDY' target='_blank' title='నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సోమ వీర్రాజుకు ఆ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందట. ఇప్పటికే సొమ్ము వీర్రాజుకు ఈ సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణ... జార్ఖండ్ కు వెళ్లే ఛాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: